![సోలమన్ దీవుల్లో భూకంపం](/styles/webp/s3/article_images/2017/09/3/71435808991_625x300.jpg.webp?itok=ymdqOZNF)
సోలమన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ: సోలమన్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదు అయిందని యూఎస్ జియాలజిస్ట్లు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదిక అందలేదని తెలిపారు. సోలమన్ దీవుల రాజధాని హోనియారాకు 334 కిలోమీటర్ల దూరంలో 8.9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు.