సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న శీతల గాలులు, తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి.ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరాదిని మంచు కప్పేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో ఆదివారం కనీస ఉష్ణోగ్రత 7.2 డిగ్రీలకు పడిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి.
ఇక రాజస్ధాలోని సికార్, భిల్వార పంజాబ్‌లోని ఆదంపూర్‌లో అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 03.0 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్ ప్రాంతంలో శనివారం దేశంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా మైనస్ 19 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, కాకినాడల మధ్య తీరం దాటుతున్న క్రమంలో ఏపీ, ఒడిషా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment