
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): శీతాకాలం ముగుస్తున్న సమయంలో అల్లూరి సీతారాజు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. చింతపల్లిలో నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గురువారం 7.6 డిగ్రీలు నమోదవగా, పాడేరు మండలం మినుములూరులో 12 డిగ్రీలు, అరకులోయలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేకువజామున పొగమంచు కురుస్తున్నప్పటికీ 7గంటలకే సూర్యోదయమవుతోంది.