ఉత్తరాదిలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో భారీగా మంచు కురవగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతా ల్లో కురిసిన చిరుజల్లులు చలిగాలుల తీవ్రతను మరింత పెంచాయి. కాశ్మీర్ లోయలో ఆరు అంగుళాల నుంచి మూడు అడుగుల మేర కురిసిన మంచు పర్యాటకులను కనువిందు చేసినా సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేసింది.