భూప్రకంపనలకు ఉత్తర భారత దేశం మరోసారి విలవిలలాడిపోయింది.
న్యూఢిల్లీ: భూప్రకంపనలకు ఉత్తర భారత దేశం మరోసారి విలవిలలాడిపోయింది. మంగళవారం నేపాల్లో సంభవించిన భూకంపం ఉత్తరాది రాష్ట్రాలపై పెను ప్రభావం చూపింది. మొత్తం 17 మంది మరణించారు. బీహార్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. ఈ రాష్ట్రంలో 16 మంది మరణించారు. ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగింది. ఉత్తరప్రదేశ్లో మరొకరు మరణించారు.
భూకంపం ధాటికి నేపాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 36 మంది చనిపోయినట్టు వార్తలు రాగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. నేపాల్ రాజధాని కఠ్మాండుకు 170 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది.