న్యూఢిల్లీ: ఢిల్లీ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్ ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మే 3న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
'ఢిల్లీ టీటీడీ టెంపుల్ లో త్వరలోనే యాగశాల, పోటు ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 3 నుంచి 8 మధ్య జమ్ములో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం. జమ్ములో జూన్ 3న కుంభాభిషేకం, 8 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. టీటీడీ దేవాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నాం.' అని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.
► మే 3 బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ
► మే 4 ఉదయం 8:30 నుంచి 9.30 మధ్య ధ్వజారోహణ ; సాయంత్రం 7:30 నుంచి 9:30 మధ్య వృషభ లగ్నం పెద్ద శేష వాహనం
► మే 5 ఉదయం 8 నుంచి 9 మధ్య చిన్న శేష వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి 8:30 మధ్య హంస వాహనం
► మే 6 శనివారం ఉదయం 8 నుంచి 9 మధ్య సింహ వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య ముత్యాల పందిరి వాహనం
► మే 7 ఆదివారం ఉదయం 8 నుంచి 9 మధ్యలో కల్పవృక్ష వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య సర్వభూపాల వాహనం
► మే 8 సోమవారం ఉదయం 8 నుంచి 9 మధ్య మోహిని అవతారం; సాయంత్రం 5 నుంచి 9 మధ్య కల్యాణోత్సవం , రాత్రి 8 నుంచి 9:30 మధ్య గరుడ వాహనం
► మే 9 ఉదయం 8 నుంచి 9 మధ్య హనుమంత వాహనం ; సాయంత్రం 7 నుంచి 8:30 మధ్య గజవాహనం
► మే 10 ఉదయం 8 నుంచి 9 మధ్య సూర్యప్రభ వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8.30 మధ్య చంద్రప్రభ వాహనం
► మే 11 ఉదయం 7:55 నుంచి 9.30 మధ్య రథోత్సవ మిధున లగ్నం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య అశ్వ వాహనం
► మే 12 ఉదయం 11:50 నిమిషాలకు చక్రస్నానం కన్యా లగ్నం ; సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణం
► మే 13 శనివారం సాయంత్రం 6 నుంచి 8 మధ్య అకంకార స్నపనం పుష్య యాగం
చదవండి: టీటీడీ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు
Comments
Please login to add a commentAdd a comment