Brahmotsavalau
-
కాణిపాకంలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డీఎల్వో వీర్రాజు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ టీటీడీ దేవాలయంలో మే 3నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్ ఛైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మే 3న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 'ఢిల్లీ టీటీడీ టెంపుల్ లో త్వరలోనే యాగశాల, పోటు ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 3 నుంచి 8 మధ్య జమ్ములో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం. జమ్ములో జూన్ 3న కుంభాభిషేకం, 8 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. టీటీడీ దేవాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నాం.' అని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ► మే 3 బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ ► మే 4 ఉదయం 8:30 నుంచి 9.30 మధ్య ధ్వజారోహణ ; సాయంత్రం 7:30 నుంచి 9:30 మధ్య వృషభ లగ్నం పెద్ద శేష వాహనం ► మే 5 ఉదయం 8 నుంచి 9 మధ్య చిన్న శేష వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి 8:30 మధ్య హంస వాహనం ► మే 6 శనివారం ఉదయం 8 నుంచి 9 మధ్య సింహ వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య ముత్యాల పందిరి వాహనం ► మే 7 ఆదివారం ఉదయం 8 నుంచి 9 మధ్యలో కల్పవృక్ష వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య సర్వభూపాల వాహనం ► మే 8 సోమవారం ఉదయం 8 నుంచి 9 మధ్య మోహిని అవతారం; సాయంత్రం 5 నుంచి 9 మధ్య కల్యాణోత్సవం , రాత్రి 8 నుంచి 9:30 మధ్య గరుడ వాహనం ► మే 9 ఉదయం 8 నుంచి 9 మధ్య హనుమంత వాహనం ; సాయంత్రం 7 నుంచి 8:30 మధ్య గజవాహనం ► మే 10 ఉదయం 8 నుంచి 9 మధ్య సూర్యప్రభ వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8.30 మధ్య చంద్రప్రభ వాహనం ► మే 11 ఉదయం 7:55 నుంచి 9.30 మధ్య రథోత్సవ మిధున లగ్నం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య అశ్వ వాహనం ► మే 12 ఉదయం 11:50 నిమిషాలకు చక్రస్నానం కన్యా లగ్నం ; సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణం ► మే 13 శనివారం సాయంత్రం 6 నుంచి 8 మధ్య అకంకార స్నపనం పుష్య యాగం చదవండి: టీటీడీ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు -
యాదాద్రి వైభవం..
-
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు శుక్రవారం కలిశారు. శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వామివారి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసిన వేద పడింతులు.. వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్ -
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు. అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
ఈ నెల 11,12 తేదీల్లో సీఎం జగన్ తిరుమల పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 11,12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సిఎం తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల విభాగాన్ని సీఎం ప్రారంభించనున్నారు. (చదవండి: దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా) అలిపిరి వద్ద గో మండపాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 12న ఉదయం శ్రీవారిని సీఎం వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ,హిందీ ఛానళ్లను సీఎం ప్రారంభించనున్నారు. కొత్త బూందీపోటు భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అన్నమయ్య, భవన్లో టీటీడీ, ఏపీ రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ, టీటీడీ కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించనున్నారు. చదవండి: చరిత్ర ఎరుగని 'ఆసరా' ఇది -
వచ్చే నెలలో తిరుమల బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుపతి: సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇక సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరుగుతుంది. (చదవండి: దర్శనాలకు ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి) చదవండి: వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు -
దీప కాంతుల శోభితం అరుణాచలం
తిరుమలలో బ్రహ్మోత్సవాలు, శబరిమలైలో మకరజ్యోతి ఉత్సవం ఎంత వైభవంగా జరుగుతాయో ..... ప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలంలో కార్తీగ దీపోత్సవాలు అంతటి వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన మొదలైన ఉత్సవాలు 14వ తేదీ దాకా జరుగుతాయి. అతి ముఖ్యమైన భరణీ దీపాన్ని ఈ నెల 10వ తేదీన అంటే వచ్చే మంగళవారం వెలిగిస్తారు. ఆ రోజు సాయంత్రం అరుణాచలం కొండ మీద అత్యంత భారీగా దివ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. పున్నమి రాత్రుల వెన్నెలతో పోటీ పడుతూ వెలిగిపోయే దివ్య జ్యోతి కాంతుల్ని దర్శించుకొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు అరుణగిరికి పయనం అవుతున్న తరుణం ఇది. దాదాపు 10, 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జ్యోతి దర్శనం ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అనేక విశిష్టతలు గోచరిస్తాయి. వీటినే కార్తీక బ్రహ్మోత్సవాలు అనికూడా అంటారు. ఇందులో మొదటి రోజున అంటే ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన .. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు. అంటే వినాయకుడు, కుమారస్వామి, చండీశ్వర స్వామి సహా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇక ప్రతీ రోజూ రెండు పూటలా ఉదయం సమయంలో చంద్రశేఖరమూర్తిగా, రాత్రి సోమస్కంధ మూర్తిగా ఊరేగింపు నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఎనిమిదో రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకోవటం జరుగుతుంది. పదో రోజు కార్యక్రమాన్ని దృష్టిలోపెట్టుకొని చాలా మంది భక్తులు ముందుగానే విచ్చేస్తుంటారు. ఎనిమిదో రోజు అంటే నేటి ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం 4 గంటల నుండి భిక్షాటనమూర్తి మాఢవీధులలో ఊరేగింపు జరుగుతుంది. అదేరోజు రాత్రి పంచకళ్యాణివాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇందులో నాలుగు కాళ్లు కిందకు ఆనని రీతిలో దీన్ని రూపొందించారు. తొమ్మిదోరోజు ఉదయం పురుష మృగ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి కైలాస రావణ వాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇక ఈ సమయానికి నెమ్మదిగా అరుణాచల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది. డిసెంబరు 10న ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణీదీపం వెలిగిస్తారు. ఈ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మార్మోగిపోతుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది. దీనిని దీపనాడార్ వంశస్తులు తీసుకొని రావటం సాంప్రదాయం. 600 మీటర్ల ఒత్తితో 2500 కేజీల ఆవునెయ్యితో అత్యంత వైభవంగా మహాదీపోత్సవం కాగానే అరుణగిరి కోటి కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోతుంది. ఈ వైభవాన్ని చూసేందుకు వెయ్యికనులు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున జరిగే ఊరేగింపును చూస్తుంటే ఒడలు పులకించిపోవటం ఖాయం. అగ్ని రూపుడైన అరుణాచలేశ్వరుడు దేవేరితో కలిసి అరుణ కాంతులతో వెలిగిపోతూ దర్శనం ఇస్తారు. అరుణాచల శివ అంటూ భక్తులు స్వామి వారిని పిలుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది. వేలమంది ఒక్కసారిగా కదులుతూ గిరిని ప్రదక్షిణం చేసుకొంటారు. తర్వాత 11వ రోజున అయ్యన్ కొలనులో చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం. 12వరోజున పరాశక్తి తెప్పోత్సవం, 13వ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం, 14వ రోజున చండికేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది. వాస్తవానికి అరుణాచల క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతాలు గోచరిస్తాయి. అగ్ని లింగ రూపంలో స్వామివారు, అందరినీ అనుగ్రహించే అమ్మవారు, పర్వత రూపంలో నిలిచిన పరమాత్మ, కలియుగంలో మార్గదర్శనం చేసిన రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తాయి. కావ్యకంఠ మహాముని ముక్తినొందిన క్షేత్రం ఇది. అందుచేత అరుణాచల దర్శనం సకలపాప హరణం అని చెప్పుకోవచ్చు. – వై. రమ విశ్వనాథన్ సీనియర్ పాత్రికేయులు -
పేదల 'తిరుపతి' కురుమూర్తి కొండలో బ్రహ్మోత్సవాలు
సాక్షి, దేవరకద్ర: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఎడ్లబండ్లపై, ప్రవేటు వాహనాలు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్గించారు. భక్తులు మెట్లపై గోవింద నమస్మరణ చేస్తు శరణ గోశ వినిపించారు. జాతర మైదానంలో భక్తులు దాసంగాలు, గండదీపాలు మోసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో దుకాణ సముదాయాలు, గాజుల దుకాణాలు, హోటళ్లు కిటకిటలాడాయి. ఇదిలాఉండగా, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. జాతర మైదానంలో దాసంగాలు పెట్టేందుకు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కుండలు; ఎడ్లబండ్లపై వస్తున్న భక్తులు; కర్ణాటక రాష్ట్రం నుంచి కురుమూర్తిస్వామి మాలధారణతో పాదయాత్రగా వస్తున్న భక్తులు పాదయాత్రగా కురుమూర్తి కొండలకు.. కొందరు భక్తులు కురుమూర్తిస్వామి మాలధారణను ధరించి పాదయాత్రలతో స్వామివారి చెంతకు చేరుకోని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కర్ణాటక రాష్టానికి చెందిన యాదగిరి నుంచి భక్తులు కురుమూర్తి స్వామి మాలను ధరించి పాదయాత్ర చేస్తు మంగళవారం కురుమూర్తి కొండకు చేరుకున్నారు. నియమ నిష్టలతో వారంరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పాదయాత్రను చేపట్టినట్టు భక్తుల తెలిపారు. ప్రతి సంవత్సరం కురుమూర్తి మాలధారణ ధరించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. -
పెరుమాళ్లు తిరునాళ్లు
నిత్య కళ్యాణ చక్రవర్తిగా అలరారుతూ... అఖండ భక్తజనానికి ఆయువై నిలిచిన శ్రీవేంకటేశ్వరుడి రూపం చూసిన వారికి తనివి తీరదు. చూడాలనే కోరిక చావదు. నేడు నిత్యం లక్ష మందికిపైగా దర్శన భాగ్యం పొందుతున్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి.. దివ్యమంగళ విగ్రహాన్ని ఆ పాద మస్తకం భక్తులకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ కథనం. బంగారుపద్మ పీఠంపై శ్రీవారి కనకపు పాదాలు... గజ్జలు, అందెలు, ఆపై ఘనమైన పట్టుపీతాంబరం... ఆ పీతాంబరం కుచ్చులపై జీరాడుతూ... వేలాడుతున్న సహస్ర నామాల మాలలు. బొడ్డుదగ్గర సూర్య కటాది అనబడే నందక ఖడ్గం, నడుమున బిగించి ఉన్న వడ్డాణం, బంగారు మొలతాడు, వజ్ర ఖచిత వరదహస్తం, తన పాదాలే పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం. ఎడమవైపున ఉన్న కటిహస్తం, కౌస్తుభమణి నవరత్న హారాలు, వక్షస్థలంపై వ్యూహ లక్ష్మి, శ్రీదేవి భూదేవి పతకాల హారాలు, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం. చేతులకు నాగాభరణాలు, భుజకీర్తులు. భుజాల నుంచి పాదాల వరకు వ్రేలాడుతున్న సాలగ్రామ మాలలు. భక్తులకు అభయమొసగే శంఖు చక్రాలు. చరగని తరగని చిరుమందహాసంతో నల్లనిమోము కలిగి నిగనిగలాడే చెక్కిళ్లు కలిగి, దొండపండు వంటి పెదవులు... ఆ పెదవుల కింద చుబుకంపైన చక్కనైన తెల్లని కర్పూరపుచుక్క. సొగసైన నాసిక, నొసటన తెల్లని నామం, భక్తులను కరుణిస్తూ ఉన్న అరవిరిసిన చూపులు. శిరసుపై నవరత్నాల మకుటరాజం. ఆపైన బంగారు మకర తోరణం... ఇలా ఆ మూలమూర్తి నిలువెత్తుగా అలంకరింప బడ్డ సుగంధ మనోహర సుమమాలలతో నిగమ.. నిగమాంత వేద్యుడైన ఆ స్వామి వారిని దర్శించిన వారు రెప్పపాటు కాలమైనా...రెప్పవాల్చకుండా శ్రీవారిని తనివితీరా దర్శించి ఆనందపుటంచులను తాకుతున్నారు. తిరుమల కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అన్ని ఉత్సవాల కంటే విలక్షణమైనవి.. విశిష్టమైనవి... వైభవోపేతమైనవి. లోక క్షేమార్థం.. నిత్యపూజాహీన ప్రాయశ్చిత్తార్థం, నిత్యపూజాదోష ప్రాయశ్చిత్తార్థం, సర్వ అశుభ నివారణార్థం శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. భగవంతుని మూలబింబంలో (ధ్రువబేరం) ఉండే శక్తి అభివృద్ధికి కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఉత్సవాలను మహోత్సవాలని, తిరునాళ్లు అని, కల్యాణోత్సవాలు అని కూడా అంటారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో అశ్వయుజ శుద్ధపాడ్యమి మొదలు అశ్వయుజ శుద్ధదశమి వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా... జగజ్జేయమానంగా ఉత్సవాలు జరుపుతారు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ దగ్గరుండి నిర్వహించటం వల్లే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు. కలౌ వేంకటనాయకః సహజసుందర క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం దివ్యమైనది... సుందరమైంది... భవ్యమైంది... నిత్య నూతనమైంది. బ్రహ్మాండమంతా వెదికినా ఈ పుణ్యక్షేత్రంతో ఏ క్షేత్రమూ సాటి రాదని ప్రతీతి. తిరుమల క్షేత్రం ఎన్నో పేర్లతో... అనేక శిఖరాలు... వివిధ లోయలు.. తీర్థాలతో భూలోక వైకుంఠంగా వన్నెకెక్కింది. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఈ తిరుమల దివ్యక్షేత్రంలో విలసిల్లే దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామి సకల దేవతాస్వరూపం. అందుకే ఈయన ‘కలౌ వేంకటనాయకః’ అని కీర్తింప బడ్డాడు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి. ఈ స్వామిని దర్శించటానికి దేశ నలుమూలల నుండే కాకుండా... ప్రపంచపు నలుమూలల నుండి, విశ్వాంతర్భాగాల నుండి రుషులు, దేవతలు, దిక్పాలురు వేంచేసి కనులపండువగా... తన్మయత్వంతో, అనన్యభక్తితో ప్రతినిత్యం స్వామిని దర్శిస్తుంటారు. బ్రహ్మాదిదేవతలంతా కూడా స్వర్గం నుండి శ్రీవేంకటాద్రికి వచ్చి నిత్యోత్సవాలను, బ్రహ్మోత్సవాలను భక్తి పూర్వకంగా తిలకిస్తారని ప్రతీతి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుని వైభవం ఇంతా అంత కాదు. అమితవైభవం గా జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తరిస్తారు. జన్మధన్యమైందని భావిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలకు చేరుకున్నవారు, స్వామి వారిని దర్శించుకున్న వారు∙ధన్యాత్ములు, పుణ్యాత్ములు. రాలేని వారు, చూడలేనివారు కనీసం మనోనేత్రాలతో వీక్షించినా ఫలదాయకమేనని శాస్త్రోక్తి.ఎంతటి అధికారి అయినా... దేశానికి రాజైనా... శ్రీవారి పడికావలి ముందు వరకు మాత్రమే అనుమతి. పడికావలి దాటాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి మూలమూర్తి సువర్ణ పద్మపీఠంపై స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉంటాడు. – తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి – ఫొటోలు: మోహనకృష్ణ కేతారి -
రంగులు, సున్నాల జాడేలేదు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధీనంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతోంది. కానీ వాటి ఏర్పాట్ల ఊసే కనిపించడం లేదు. ఆలయంలో ఈనెల 11 నుంచి అధ్యయనోత్సవాలు, 15 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏడాది 10రోజుల ముందు నుంచి రంగులు, సున్నాలు. జాజులు అద్దేవారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేసేవారు. కానీ ఈ సారి ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. గత ఏడాది ఈపాటికే ఆలయంలో హోమగుండాలు నిర్మించి విగ్రహాలకు పాలిషింగ్ చేసి కరపత్రాలను ఊరూరా పంచారు. ప్రతిసారీ అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు కలిపి 15 మంది రుత్వికులకు వారం పది రోజుల ముందే ఆహ్వానాలు పంపేవారు. అయితే ఈసారి ఈ రోజు వరకూ ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని అధికారులు చెబుతున్నారు.« ధ్వజస్తంభం, స్వామి అమ్మవార్ల వాహనాలకు పాలిషింగ్ చేసేవారు. ప్రస్తుతం ఇటువంటి ఆనవాళ్లు కనిపించడంలేదు. యాదాద్రి కొండపైన నిర్మాణ పనుల్లో భాగంగా అన్ని కార్యాలయాలు తొలగిస్తున్న కారణంగా అక్కడి కార్యాలయాలను కొన్నింటిని కొండ కిందికి, మరికొన్నింటిని పాతగుట్టకు మార్చాల్సి ఉంటుంది. దీంతో పాతగుట్ట బ్రహ్మోత్సవాలకు ఎక్కువమంది భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ పాతగుట్టలో అధికారుల జాడే లేకుండా పోయింది. గతంలో వాల్‌పోస్టర్లను అందరి సమక్షంలో ఆవిష్కరించారు. ఈసారి ఎవరికీ తెలియకుండా వాల్ పోస్టర్లను ఆవిష్కరించినట్లు అధికారులే చెబుతున్నారు. మొత్తానికి పాతగుట్ట ఉత్సవాల సందడే లేకుండా పోయింది. -
వైభవంగా మహారథోత్సవం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం శ్రీవేంకటేశ్వరుడి మహా రథోత్సవం వేడుకగా సాగింది. గుర్రాల వంటి ఇంద్రి యాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు. వాహన సేవ తరువాత సుమారు గంట పాటు పం డితులు నిర్వహించిన వేదగోష్టితో తిరుమల సప్తగిరులు పులకించాయి. టీటీ డీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు రథాన్ని లాగారు. గురువారం రాత్రి మలయప్పస్వామి అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు. నేడు చక్రస్నానం: శుక్రవారం ఉదయం 5 నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం వర హాస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలా ల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 5 నుంచి ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
గోవిందా శ్రిత గోకులనందా
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి చిన్న శేష వాహనంపై శ్రీకృష్ణావతారంలో భక్తులను కటాక్షించారు. పట్టు పీతాంబరాలు, మరకత మాణిక్యాదుల విశేషాభరణాలు, పరిమళాలు వెదజల్లే పుష్పమాలలు ధరించి ఐదు శిరస్సుల శేషుని నీడన వేణువు చేతబట్టి మురళీకృష్ణుడి రూపంలో తిరువీధుల్లో విహరించారు. ఊరేగింపు ముందు గజరాజులు, అశ్వాలు, నందులు కదులుతుండగా.. జీయర్ స్వాములు దివ్య ప్రబంధ గానం ఆలపిస్తుండగా.. భజన, కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11వరకు వాహన సేవ జరిగింది. అశేష భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. రాత్రి హంస వాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. –సాక్షి, తిరుమల నేటి వాహన సేవలు ఉదయం : సింహ వాహనం బ్రహ్మోత్సవాలలో మూడోరోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సింహ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జంతువులకు రాజైన సింహం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహన శక్తికి, గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆర్యోక్తి. రాత్రి : ముత్యపు పందిరి వాహనం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. సుకుమారసేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈవాహనం ద్వారా స్వామి వారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తారు.రాత్రి 9గంటలకు తిరువీధుల్లో ఈ వాహన సేవ ప్రారంభమై 11వరకు సాగుతుంది. భక్త వాణి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కల్పిస్తున్న వసతులు వారి మాటల్లో.. తిరుపతి (అలిపిరి)/అర్బన్ కనులారా దర్శించుకున్నాం తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకున్నాం. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు అద్భుతంగా ఉన్నాయి. హరినామ సంకీర్తన , సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వాహన సేవలు కట్టిపడేస్తున్నాయి. టీటీడీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. – శ్రీనివాస్, వేలూరు, తమిళనాడు వాహన సేవలో తరించాం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం చిన్నశేష వాహన సేవలో పాల్గొన్నా.. గోవిందనామ స్మరణ మధ్య వాహన సేవలో శ్రీనివాసున్ని దర్శించుకున్నాం. గత బ్రహ్మోత్సవాలకు వచ్చాం. కానీ వాహన సేవను కనులారా చూడలేకపోయాం. ఈ సారి శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం కలిగింది. – వైఎస్ దేవేంద్ర, రాణిపేట, తమిళనాడు ఆర్జిత సేవలకు లాటరీ సరికాదు తిరుమలలో ఆర్జిత సేవలకు లాటరీ విధానం రద్దు చేయాలి. ఆన్లైన్ విధానంలో ఆర్జిత సేవలను భక్తలకు అందించాలి. క్యూలైన్లలో తోపులాట జరుగుతోంది, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు రెండు లైన్లలో క్యూలో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.– గౌరీదేవి, హైదరాబాద్ మెరుగైన వసతులు కల్పించాలి భక్తులకు మెరుగైన సేవలందించేలా టీటీడీ చర్యలు తీసుకోవాలి. తిరుమలకు వచ్చే భక్తులకు సులభంగా వసతి కల్పించాలి. చంటి బిడ్డలతో తిరుమలకు వచ్చే వారికి మంచి సౌకర్యాలు కల్పించాలి. – పుష్పావతి, విజయవాడ విద్దుదీపాలంకరణ చాలాæ బాగుంది తిరుమల క్షేత్రంలో విద్యుద్దీపాలంకరణ బాగుంది. రాత్రివేళల్లో శ్రీవారి నమూనాలు, కటౌట్లు, ఆర్చిలు దేదీప్యమానంగా వెలుగుతూ కనువిందు చేస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే తిరుమల గిరుల్లోనే చూసి తరలించాలి. అందుకే ఏటా బ్రహ్మోత్సవాలకు వస్తున్నాం – శిరీష, అమలాపురం -
భక్తులతో పోటెత్తిన బిలకూట క్షేత్రం
బిట్రగుంట (నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వేంకటేశ్వరస్వామి బుధవారం రాత్రి పుష్కరిణిలో జలవిహారం చేశారు. కల్యాణోత్సవానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా పెళ్లి కుమారుడైన స్వామివారు కొండపై కొలువుదీరగా అర్చకులు వైఖానస ఆగమోక్తంగా తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రధానార్చకులు వేదగిరి వేంకట నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వేదపండితులు ఉభయ దేవేరులను, స్వామివారిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలు, పట్టుపీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని ఉభయదేవేరులతో కొలువుదీర్చి జలవిహారం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెప్పోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆచారాన్ని అనుసరించి తెప్పోత్సవానికి అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరుకు చెందిన పీటీ జగన్నాథ్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. పుష్కరిణలో జలవిహారం చేస్తున్న స్వామివారు చందనాలంకారంలో... ఆలయ గర్భగుడిలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, దేవేరులు చందనాలంకారంలో కొలువుదీరి భక్తులకు చల్లని ఆశీస్సులు అందజేశారు. చందనాలంకార సేవకు ఉప్పుటూరు నాగరాజు, ఇందిరా, ఉప్పుటూరు సుధాకర్‌రావు, సుజాత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. గజవాహనంపై ప్రసనున్నడు... బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం పూర్తి చేసుకున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి పెండ్లి కుమారుడి గజవాహనంపై ఊరేగారు. శుభకర మేళతాళాలు, మంగళవాయిద్యాలు, జయజయధ్వానాల మధ్య స్వామివారు గజవాహనంపై ఊరేగే దృశ్యం నేత్రపర్వంగా సాగింది. గజవాహనసేవకు గుంటూరుకు చెందిన నాగినేని వెంకటేశ్వర్లు, వాణిశ్రీ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. గజవాహనంపై విహారానికి బయలుదేరిన ప్రసన్న వేంకటేశ్వరుడు