బేడా మండపంలో అగ్ని ప్రతిష్ట జరుపుతున్న అర్చకులు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు.
అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
Comments
Please login to add a commentAdd a comment