తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం శ్రీవేంకటేశ్వరుడి మహా రథోత్సవం వేడుకగా సాగింది. గుర్రాల వంటి ఇంద్రి యాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు. వాహన సేవ తరువాత సుమారు గంట పాటు పం డితులు నిర్వహించిన వేదగోష్టితో తిరుమల సప్తగిరులు పులకించాయి. టీటీ డీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు రథాన్ని లాగారు. గురువారం రాత్రి మలయప్పస్వామి అశ్వవాహనంపై భక్తులను పరవశింపజేశారు.
నేడు చక్రస్నానం: శుక్రవారం ఉదయం 5 నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం వర హాస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలా ల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 5 నుంచి ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
వైభవంగా మహారథోత్సవం
Published Fri, Sep 21 2018 2:26 AM | Last Updated on Fri, Sep 21 2018 2:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment