
ఏపీ సహా ఉత్తరాదిలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. మయన్మార్లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. మయన్మార్లోని మొనివా నగరానికి 70 కిలో మీటర్ల దూరంలో వాయవ్య ప్రాంతంలో భూకంప కేంద్రం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.
దీని ప్రభావం ఏపీ, దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలపై చూపింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. 3 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. నోయిడా, ఢిల్లీ, కోల్కతా, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కోల్కతాలో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.