ఢిల్లీ: ఉత్తరాదిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరికొన్ని రోజులు ఇదే రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన ఐఎండీ స్పష్టం చేయడంతో ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. దక్షిణ ఢిల్లీలోని మండీలో స్టీల్ బ్రిడ్జ్ కూలిపోవడం వరద తీవ్రతకు అద్దం పడుతోంది.
రేపు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకలించారు. 41 ఏళ్ల తర్వాత రికార్డు స్తాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1982 జూలైలో ఢిల్లీని అతాలకుతలం చేసిన వర్షాలు తర్వాత ఆ తీవ్రతను దాటి వర్షాలు పడటం నగర వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్‌లోని పలుప్రాంతాలు నీట మునిగాయి. తద్వారా పలు ప్రాంతాల్లో రహదారుల్ని మూసివేశారు. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు.
Capital of the world’s fifth largest economy. Video from GK1.
— Shweta Sengar (@ShwetaSengar) July 8, 2023
Flooding, long power cuts, garbage on roads, massive traffic jams…
Delhi is a shit show!
#DelhiRains pic.twitter.com/yQosD51XO2
చదవండి: జైలులో నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. సుఖేష్ సంచలన లేఖ
Comments
Please login to add a commentAdd a comment