న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరదల ధాటికి పలు చోట్ల రోడ్డు రవాణా స్తంభిస్తోంది. భారీ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం(జులై )1 వెల్లడించింది.
వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది.
మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment