ఉత్తరభారతాన్ని చలి పులి వణికిస్తోంది.
సిమ్లా: ఉత్తరభారతాన్ని చలి పులి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచుకురుస్తోంది. దీని కారణంగా చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. ఈ సీజన్‌లో కులూ, మనాలీకి వచ్చే టూరిస్టులను రావొద్దంటూ హిమాచల్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
చలి తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో మంచు గడ్డకట్టుకపోయి కరెంటు, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని హిమాచల్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఇప్పటివరకూ లేలో మైనస్ 13 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు.