తజకిస్థాన్లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది.
న్యూఢిల్లీ: తజకిస్థాన్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. దీని ప్రభావంతో మన దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, జమ్ము కశ్మీర్ ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
తజకిస్థాన్లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇంతవరకు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీనగర్, చండీగఢ్ ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.