పాకిస్థాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఆప్ఘనిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులో 200 కిలోమీటర్ల లోతులో భూకంపన కేంద్రాన్ని గుర్తించారని జియో టీవీ వెల్లడించింది. ఇస్లామాబాద్, ఫైసలాబాద్, పెషావర్, మియాన్ వలీ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోనూ భూకంపన ప్రభావం కనిపించింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం సమాచారం లేదు. ఉత్తర భారత దేశంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. పంజాబ్, ఢిల్లీ, కాశ్మీర్ లలో స్వల్ప భూకంపం సంభవించింది.