![మరోసారి ఉత్తర భారతం వణికింది - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71451098057_625x300.jpg.webp?itok=1kdwGqEm)
మరోసారి ఉత్తర భారతం వణికింది
భూప్రకంపనలతో మరోసారి ఉత్తర భారతం వణికింది. ఉత్తర భారత్ సహా పాకిస్థాన్, అప్ఘానిస్తాన్‌లలో అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అఫ్గనిస్తాన్, తజకిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు గుండా ఈ భూకంపం ఏర్పడింది.
దీంతో చండీగడ్, జైపూర్, ఢిల్లీ సహా ఇతర సమీప ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు వ్యాపించాయి. భూకంపంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం 203.5కిలో మీటర్ల లోతులో ఏర్పడినట్లు అమెరికా జియెలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగనట్లు సమాచారం.