
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు
ఉత్తర భారతదేశంలో శుక్రవారం వరణుడు బీభత్సం సృష్టించాడు.
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో శుక్రవారం వరణుడు బీభత్సం సృష్టించాడు. ఉత్రరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ - కశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వివరాలు.. ఉత్తరాఖండ్లో వర్షం కారణంగా ఛార్ధామ్ యాత్రకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో భక్తులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు రంగంలోకి దిగాయి.
అదే విధంగా జమ్మూ - కశ్మీర్లో కూడా వర్షాలు పడ్డాయి. శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ప్రమాదకర స్థాయిని తలపిస్తోంది.
వర్షం దెబ్బకు ఉత్తర ప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఓ ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు.