flop movies
-
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్‌దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు. రెండు దశాబ్దాలకు సీక్వెల్ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్‌తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్లైక్ కొట్టారు.నేరుగా ఓటీటీలో రిలీజ్తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.ముఖ్య కారణం!కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్‌లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్‌లో లక్షల్లో వచ్చిపడ్డాయి. చదవండి: Pushpa 2 Movie: నార్త్‌లో పుష్ప 2 దూకుడుకు బ్రేక్? -
జనవరి టు మార్చి టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్
-
2020: బాలీవుడ్ చెత్త సినిమాలు ఇవే
బాలీవుడ్లో హిట్ వస్తే ఎంత పేరు వస్తుందో ఫ్లాప్ వస్తే అంత రిపేరు కూడా వస్తుంది. హిట్ అవుతుందని ప్రేక్షకుల మీదకు వదిలిన సినిమాలు బొక్కబోర్లా పడే సన్నివేశాలు ప్రతి సంవత్సరంలో ఉంటాయి. బాలీవుడ్లో 2020లో అతి చెత్త ఐ.ఎం.డి.బి రేటింగ్స్ పొందిన సినిమాలుగా ఆరు సినిమాలు తేలాయి. అవి 1.లవ్ ఆజ్ కల్ (దర్శకుడు ఇమ్తియాజ్ అలీ), 2.సడక్ 2 (దర్శకుడు మహేష్‌భట్), 3.కూలీ నంబర్ 1 (దర్శకుడు డేవిడ్ ధావన్), 4. ఇందూకి జవాని (అబిర్ సేన్‌గుప్తా) 5. ఘోస్ట్ స్టోరీస్ (కరణ్ జొహర్), 6.లక్ష్మి (దర్శకుడు ప్రభుదేవా). 2020లో విడుదలైన ఈ 6 సినిమాలు ఐ.ఎం.డి.బి రేటింగ్స్‌లో 2 కంటే తక్కువ రేటింగ్స్ నమోదు చేసుకున్నాయి. వీటిలో లవ్ ఆజ్ కల్, సడక్ సీక్వెల్స్ అయితే కూలీ నంబర్ 1 రీమేక్. లక్ష్మి కూడా రీమేక్. ఘోస్ట్ స్టోరీస్‌ని పెద్ద పెద్ద దర్శకులు డైరెక్ట్ చేసినా అస్సలు ఫలితం కనిపించలేదు. తెలుగు,తమిళంలో హిట్ అయిన ‘కాంచన’ హిందీలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళంలో హీరో పిరికివాడు. హిందీలో ధైర్యస్తుడు. అక్కడే ట్రీట్మెంట్ రాంగ్ వెళ్లింది. దానికితోడు ఇందులో లవ్ జిహాద్ ఉందనే విమర్శలు కూడా వచ్చి సినిమా ప్రతికూల ఫలితాలు పొందింది. సడక్ 2 మీద హీరో సంజయ్ దత్ ఆశలు పెట్టుకున్నా అందులో ఆలియా భట్ నటించినా ఫలితం కనిపించలేదు. సరైన కథ, సరైన దర్శకత్వం ఉంటేనే సినిమా నిలుస్తుందని ఇంత పెద్ద స్టార్స్ ఉన్న సినిమాల ఫ్లాప్ ద్వారా మరోసారి అర్థమైంది బాలీవుడ్‌కి. -
‘చిత్రం’గా చతికిలపడ్డాయి..
సినిమాకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు నేటితరం నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు అంతే భారీమొత్తంలో నష్టాలను తీసుకుచ్చి నిర్మాతలకు ఊహకందని విధంగా చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఈ ఏడాది కొంతమంది హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. ఎంత ప్రచారం చేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించడంలో కొన్ని చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అవేంటో చూద్దాం.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ భారీ అంచనాలతో విడుదలైంది. దీనికోసం విపరీతమైన పబ్లిసిటీ కూడా చేశారు. కానీ విడుదలైన తొలినాడే ఈ సినిమా తేలిపోయింది. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇక థియేటర్ దాకా వెళ్లిన ప్రేక్షకులకు అనవసరంగా వచ్చాం అన్న ఫీలింగ్ రాకమానదు. వెరసి ఈ సినిమా ఒక పాత చింతకాయ పచ్చడి. కలెక్షన్లు బాగున్నా ఫ్లాఫ్‌తో 2019కు బాలయ్య గుడ్‌బై చెప్పక తప్పలేదు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు ఎంత సూపర్ హిట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ కాకపోయినప్పటికీ అదే టైటిల్‌తో మన్మథుడు2 ద్వారా అభిమానులను పలకరించాడు. ఇప్పటికీ తను గ్రీకువీరుడినే అంటూ వచ్చిన మన్మథుడు 2 అట్టర్ ఫ్లాఫ్గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. ఆయన కెరీర్లోనే పెద్ద ఫ్లాఫ్గా నిలిచిపోయింది. గతేడాది రంగస్థలం సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన మెగా హీరో రామ్‌చరణ్ ఈ ఏడాది మాత్రం ఘోర ఓటమిని చవిచూశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. బలహీనమైన కథకు బోలెడు ఫైట్ సీన్లు జోడించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రౌడీతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంచనాలు ఘనం, ఫలితం శూన్యం అన్న మాదిరిగా తయారైంది ఈ సినిమా పరిస్థితి. వరుసగా అపజయాలను చవిచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఆశాదీపంగా కనిపించినా చివరికి నిరాశనే మిగిల్చింది. ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకున్న హీరో కార్తికేయ. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను వచ్చినంటూ ముందూ వెనకా చూసుకోకుండా చేసుకుంటూ పోయాడు. అదే అతనికి పెద్ద మైనస్‌గా మారింది. గుణ 369 దారుణంగా దెబ్బ తీసినా 90ఎమ్‌ఎల్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాది హారర్ చిత్రాలు ఏమంత మెప్పించలేకపోయాయి. సుధీర్‌బాబు, నందిత కలిసి నటించిన కామెడీ హారర్ ఫిల్మ్ ‘ప్రేమకథా చిత్రం’ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో సప్తగిరి కామెడీతో చెలరేగిపోయాడు. ఈ చిన్న సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీంతో హీరో సుమంత్ దానికి సీక్వెల్ ట్రై చేశాడు. కానీ రోత పుట్టించే కామెడీతో, నాసిరకమైన కథతో ప్రేక్షకులను నిరాశపరిచింది. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తర్వాత హీరోగానూ రాణించాడు. కానీ ఆయనకు హిట్ రావడమే గగనమైపోయింది. తాజాగా ఆయన నటించిన 26వ చిత్రం ‘చాణక్య’ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. పాత కథను తిప్పి తిప్పి చూపించడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. గోపీచంద్ మాత్రమే ఫుల్ ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించింది. మిగతావాళ్లందరూ పేలవ ప్రదర్శన కనబర్చారు. కనీసం పాటలు కూడా బాగోలేవు. అలా చాణక్య మరో ఫ్లాఫ్గా మిగిలిపోయింది. సందీప్ కిషన్‌కు ఈ ఏడాది కూడా అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిను వీడని నీడను నేనేతో మళ్లీ సక్సెస్‌బాట పట్టాడనుకునే లోపే తెనాలి రామకృష్ణతో డిజాస్టర్ బాట పట్టాడు. గతంలో కామెడీ సినిమాలతో మంచి విజయాలందుకుని.. ఆ తర్వాత ట్రాక్ తప్పిన దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి ‘తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ’తో పలకరించాడు. కానీ ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకపోవడంతో ప్రేక్షకులు కనీసం ఈ సినిమా వంక చూడనైనా చూడలేదు. జబర్దస్త్ జోకులతో సినిమా నెట్టుకొద్దామనుకున్నా అక్కడక్కడా తప్పితే ఆ హాస్యం కూడా పెద్దగా పండలేదు. రాజుగరి గదితో మంచి హిట్ అందుకున్న దర్శక నిర్మాత ఓంకార్ రాజుగారి గది3తో నిరాశపర్చాడు. తన తమ్ముళ్లకు మంచి హిట్ ఇస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఓంకార్ రాజుగారి గది3 రూపొందించాడు. కానీ ఈ సినిమా రొటీన్ కామెడీ హారర్ చిత్రంగా పేరు ముద్రించుకోయింది. అలా రాజుగారి గది3 ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. -
బాక్సాఫీస్ లాస్
-
వారికే అవకాశం అంటున్న యువహీరో
సిని పరిశ్రమలో విజయం సాధించిన వారికే విలువ. ఈ సూత్రం హీరోయిన్లకే కాదు దర్శకులకు వర్తిస్తుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఇక ఇండస్ట్రీలో వారిని పట్టించుకునే వారు ఉండరు. కానీ యువ హీరో శర్వానంద్ పద్దతి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విలక్షణమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ తాజాగా ఒప్పుకున్న రెండు సినిమాల దర్శకులను చూస్తే చాలా సాహసం చేస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యువ హీరో ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు కాగా, మరో చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకుల పాత చిత్రాలు రెండు ఫ్లాప్ చిత్రాలే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలోవచ్చిన ‘లై’, నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కేశవ’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత ఈ దర్శకుల చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శర్వానంద్ వీరికి మరో అవకాశం ఇవ్వడమంటే సాహసం చేశాడనే చెప్పవచ్చు. అయితే శర్వానంద్‌కు వీరిద్దరు చెప్పిన కథ నచ్చడం వల్లే అవకాశం ఇచ్చాడని సన్నిహతులు తెలుపుతున్నారు. దర్శకుల గత విజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని మరోసారి నిరూపించాడు శర్వానంద్. అలానే మరో ఫ్లాప్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. -
నేను ఫ్లాప్ యాక్టర్
కరణ్ జోహార్ బాలీవుడ్లో ఎన్నో బ్లాక్‌బాస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ వంటి చిత్రాలు ఓ ఉదాహరణ. డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ అయిన కరణ్ ‘నేను ఫ్లాప్ యాక్టర్’ అంటున్నారు. పూర్తి స్థాయి యాక్టర్‌గా కరణ్ చేసిన ‘బాంబే వెల్వెట్, వెల్కమ్ న్యూయార్క్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. ‘‘నేనో ఫ్లాప్ యాక్టర్‌ని. నటుడిగా చేసిన ఏ ఒక్క సినిమా సరిగ్గా ఆడలేదు. సక్సెస్ఫుల్ సినిమాలు లేకపోవడంతో ఎవ్వరూ నన్ను యాక్టర్‌గా తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే ఆ సినిమాల్లో నా నటన కూడా అంత చెప్పుకోదగ్గ రేంజ్లో లేదు’’ అని నిజాయితీగా పేర్కొన్నారు. -
నా ఫ్లాపులకు నా పొగరే కారణం
ఇటీవలి కాలంలో తన సినిమాలు ఫ్లాప్ కావడానికి తన పొగరే కారణం తప్ప మరేమీ కాదని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. చాలా కాలం తర్వాత ముంబై తిరిగి వెళ్లిన ఆయనను అక్కడి మీడియా ప్రశ్నించినపుడు ఆయనీ సమాధానం చెప్పారు. తాను సినిమాలు త్వరత్వరగా తీసేసి చుట్టేయడం వల్లే అవి ఫ్లాప్ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారని, కానీ ఇంతకుముందు తాను తీసిన డిపార్ట్మెంట్, ఆగ్ లాంటి సినిమాలకు చాలా సమయం తీసుకున్నా.. అవి కూడా ఆడలేదని గుర్తుచేశారు. సర్కార్ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేశానన్నారు. సత్యకు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువని గుర్తుచేశారు. తాను అడవిగుర్రం లాంటివాడినని, చాలా వేగంగా ఉంటానని, తన ఆటవికతను అణిచేసుకోడానికి ప్రయత్నిస్తే, తనలోని విభిన్నత కూడా అణిగిపోతుందని వర్మ అన్నారు. తాను రెండేళ్లలో ఆరు స్క్రిప్టులు పూర్తిచేశాని, దాంతోపాటు వందలాది విదేశీ సినిమాలు చూసి, పునరుత్తేజం పొందానని చెప్పారు. తన పొగరు వల్ల, అతి నమ్మకం వల్ల చేసిన తప్పులన్నీ సరిచేసుకుని.. ఇప్పుడు ముంబైకి వచ్చానని అన్నారు. ఇక తన కొత్త కార్యాలయం 'కంపెనీ' ఇప్పుడో టూరిస్టు స్పాట్‌లా మారిపోయిందని వర్మ తెలిపారు. కేవలం బాలీవుడ్ నుంచే కాక టాలీవుడ్ నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తున్నారని, కొంతమంది అసలు సినిమాలతో సంబంధం లేనివాళ్లు కూడా వస్తున్నారని చెప్పారు. తన మీద ఉన్న పాత ముద్రను పూర్తిగా చెరిపేసుకుని కొత్తతరహాలో కనిపించాలనే ఈ ఆఫీసును కూడా అలా తయారుచేశానన్నారు. -
వెంకీకి కలిసిరాని 2013
-
వాళ్లిద్దరితో రెండో సినిమా ఫట్టే!