
బాలీవుడ్‌లో హిట్ వస్తే ఎంత పేరు వస్తుందో ఫ్లాప్ వస్తే అంత రిపేరు కూడా వస్తుంది. హిట్ అవుతుందని ప్రేక్షకుల మీదకు వదిలిన సినిమాలు బొక్కబోర్లా పడే సన్నివేశాలు ప్రతి సంవత్సరంలో ఉంటాయి. బాలీవుడ్‌లో 2020లో అతి చెత్త ఐ.ఎం.డి.బి రేటింగ్స్ పొందిన సినిమాలుగా ఆరు సినిమాలు తేలాయి. అవి 1.లవ్ ఆజ్ కల్ (దర్శకుడు ఇమ్‌తియాజ్ అలీ), 2.సడక్ 2 (దర్శకుడు మహేష్‌భట్), 3.కూలీ నంబర్ 1 (దర్శకుడు డేవిడ్ ధావన్), 4. ఇందూకి జవాని (అబిర్ సేన్‌గుప్తా) 5. ఘోస్ట్ స్టోరీస్ (కరణ్ జొహర్), 6.లక్ష్మి (దర్శకుడు ప్రభుదేవా).
2020లో విడుదలైన ఈ 6 సినిమాలు ఐ.ఎం.డి.బి రేటింగ్స్‌లో 2 కంటే తక్కువ రేటింగ్స్ నమోదు చేసుకున్నాయి. వీటిలో లవ్ ఆజ్ కల్, సడక్ సీక్వెల్స్ అయితే కూలీ నంబర్ 1 రీమేక్. లక్ష్మి కూడా రీమేక్. ఘోస్ట్ స్టోరీస్‌ని పెద్ద పెద్ద దర్శకులు డైరెక్ట్ చేసినా అస్సలు ఫలితం కనిపించలేదు. తెలుగు,తమిళంలో హిట్ అయిన ‘కాంచన’ హిందీలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళంలో హీరో పిరికివాడు. హిందీలో ధైర్యస్తుడు. అక్కడే ట్రీట్‌మెంట్ రాంగ్ వెళ్లింది. దానికితోడు ఇందులో లవ్ జిహాద్ ఉందనే విమర్శలు కూడా వచ్చి సినిమా ప్రతికూల ఫలితాలు పొందింది. సడక్ 2 మీద హీరో సంజయ్ దత్ ఆశలు పెట్టుకున్నా అందులో ఆలియా భట్ నటించినా ఫలితం కనిపించలేదు. సరైన కథ, సరైన దర్శకత్వం ఉంటేనే సినిమా నిలుస్తుందని ఇంత పెద్ద స్టార్స్ ఉన్న సినిమాల ఫ్లాప్ ద్వారా మరోసారి అర్థమైంది బాలీవుడ్‌కి.
Comments
Please login to add a commentAdd a comment