తాడేపల్లి : ఏపీలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు అక‍్రమ అరెస్టులు చేస్తూనే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు.
దీనిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, భరోసా కల్పించడం, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తాజాగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పని చేయనుంది.
జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలు
శ్రీకాకుళం : సీదిరి అప్పలరాజు, శ్యామ్
విజయనగరం: బెల్లాని చంద్రశేఖర్, జోగారావు
విశాఖపట్నం : భాగ్యలక్ష్మి, కెకె రాజు
తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత
పశ్చిమ గోదావరి : కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపి)
కృష్ణా : మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి
గుంటూరు : విడదల రజని, డైమండ్ బాబు
ప్రకాశం : టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి
నెల్లూరు : రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)
చిత్తూరు : గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
అనంతపురం : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్
కడప : సురేష్‌బాబు, రమేష్‌యాదవ్
కర్నూలు హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment