విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలు ప్రేమకు నిరాకరించిందని సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన పార్థసారధి మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారణమైన ప్రేమించిన యువతిని స్టేషన్కు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.