హైదరాబాద్: రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం ఉండదని మంత్రి పార్ధసారథి స్పష్టం చేశారు. ఒకవేళ తీర్మానం అనివార్యమైతే విభజనను వ్యతిరేకిస్తామన్నారు. విభజన అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ తీర్మానం ఉండదన్నారు. అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందని తెలిపారు. సమన్యాయం అంటున్న టీడీపీ నేతలు అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి తామంతా విభజన జరగదనే ఆశాభావంతో ఉన్నామని, జరిగితే భవిష్య కార్యచరణపై చర్చిస్తామన్నారు.
విభజన అంశంపై కేంద్రం వేగవంతంగా పావులు కదుపుతోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనతో పాటు, రాయల తెలంగాణ అంశాన్ని కూడా తెరమీదుకు తెచ్చింది. కేంద్రం కొత్తగా ఎత్తుకున్న రాయల తెలంగాణ అంశం మాత్రం విభజన బిల్లు ఆమోదింప చేసుకునే క్రమంలో ఆడుతున్న డ్రామా అని నేతలు అభిప్రాయపడుతున్నారు.