తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు.
అనంతం:తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని మరోమారు ఆయన స్పష్టం చేశారు. టి.బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టి.బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామన్నారు. ఆర్టికల్-3ని వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 అనేది రాష్ట్రాన్ని విడగొట్టడానికే కాదు..విభజించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.