Artical 3
-
అసెంబ్లీలో టి.బిల్లును ఓడిస్తాం: మంత్రి పార్థసారధి
అనంతం:తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని మరోమారు ఆయన స్పష్టం చేశారు. టి.బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టి.బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామన్నారు. ఆర్టికల్-3ని వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 అనేది రాష్ట్రాన్ని విడగొట్టడానికే కాదు..విభజించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. -
రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకున్న వైఎస్ జగన్, ఈరోజు మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 పేజీల నివేదికను ప్రణబ్‌కు అందజేశారు. రాష్ట్రాన్ని కేంద్రం అడ్డగోలుగా విభజించాలని చూస్తోందని ప్రణబ్‌కు చెప్పామని, భాషా ప్రయుక్త రాష్ట్రాలను 60ఏళ్ల తర్వాత ఇలా విభజించడం సరికాదని వివరించామని ఆ తర్వాత వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు. ఈ రాష్ట్ర విభజన విధానం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే ప్రమాదముందని రాష్ట్రపతికి వివరించామని, రాష్ట్రంలో నీటి సమస్యలు మరింత జటిలమవుతాయని ప్రణబ్‌కు చెప్పామని ఆయన అన్నారు. ఆర్టికల్ 371(డి) గురించి కూడా ప్రణబ్‌కు వివరించామని, తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని వైఎస్ జగన్ చెప్పారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరారు. అలాగే.. ఈరోజు మధ్యాహ్నం జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా జగన్, ఇతర నేతలు కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ ఆదివారం రోజున జగన్ భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
ఢిల్లీ చేరుకున్న జగన్, మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఈరోజు మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు. జగన్మోహన్రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి.. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే.. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ ఆదివారం రోజున జగన్ భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు. -
మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు
రాజమండ్రి : రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ విభజనపై ప్రతివాళ్లూ తమకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. చాలామందికి ఏం జరగబోతుందన్న దానిపై స్పష్టత లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మెజార్టీ శాసనసభ్యులు విభజనను వ్యతిరేకిస్తే విడగొట్టడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని, దేశానికి సంబంధించిందన్నారు. ఆర్టికల్ 3లో మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కారణం చెప్పారన్నారు. అలాగే తీర్మానం అన్నమాటను స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.