
మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు
రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
రాజమండ్రి : రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ విభజనపై ప్రతివాళ్లూ తమకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. చాలామందికి ఏం జరగబోతుందన్న దానిపై స్పష్టత లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో మెజార్టీ శాసనసభ్యులు విభజనను వ్యతిరేకిస్తే విడగొట్టడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని, దేశానికి సంబంధించిందన్నారు. ఆర్టికల్ 3లో మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కారణం చెప్పారన్నారు. అలాగే తీర్మానం అన్నమాటను స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.