అన్నదమ్ముల బంధం చెడపకండి | andhra-pradesh-division-bill | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల బంధం చెడపకండి

Published Sat, Nov 14 2015 12:05 PM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM

అన్నదమ్ముల బంధం చెడపకండి - Sakshi

అన్నదమ్ముల బంధం చెడపకండి

పార్లమెంట్‌లో ఏం జరిగింది- 12

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20-02-2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాల కొనసాగింపు.

వెంకయ్య నాయుడు: గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజె క్టులు సీమాంధ్రకు, నెట్టెంపాడు తెలంగాణకు అత్యావ శ్యకం. ఈ బిల్లులో ఆ ఆరు/ఏడు ప్రాజెక్టుల విషయం, ప్రధానంగా కేటాయిం పులు జరపాలి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాం తాలు రెండూ కట్టు బడేలా, భవిష్యత్‌లో తగా దాలు రాకుండా వుండేలా చెయ్యాలి. కృష్ణా జలాల విషయమై అన్న దమ్ముల్లాంటి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య గొడవలు రాకుండా ఒక యంత్రాంగాన్ని తయారు చెయ్యాలి.
 
 మళ్లీ వెనక్కి వస్తే బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, హెచ్‌సీఎల్, డిఫెన్స్ సంస్థలూ, దాదాపుగా అన్నీ హైద్రాబాద్‌లోనే వున్నాయి. ప్లానింగ్ కమిషన్ వారు, సీమాంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలు నెలకొల్పేలా ప్రభుత్వంతో చర్చించి పథకాల రూపకల్పన చెయ్యాలి. తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ అంతే వెనకబడి ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హైద్రాబాద్‌లో వున్న రైల్వేజోన్ తెలంగాణ ప్రాంత అవసరాలు తీరుస్తుంది. మేము సీమాంధ్ర- విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ప్రాంతాలను కలిపి కొత్త రైల్వే జోన్ కోరుకుంటున్నాం.
 
 సార్! ఇక ఇతర విషయాల్లోకి వస్తే, సరైన వాతావరణం ఏర్పడాలి. దురదృష్టవశాత్తూ భారత ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవటం లేదు. మొదటి సంవత్సరం సీమాంధ్రకు ఏర్పడబోయే ఆర్థిక లోటును భర్తీ చేయటానికి భారత ప్రభుత్వం రూ. 10,000 కోట్లు కేటాయించాలి. వాళ్లు ఈ విషయాన్ని ఫైనాన్స్ క మిషన్‌కు పంపించి, ఫైనాన్స్ కమిషన్ వారు రిపోర్టు పంపించేంత లోపుగా రాష్ట్రం ఇబ్బందులు పడకూడదు.
 
 అందువల్ల ప్రధాన మంత్రి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని ఉదారంగా సీమాంధ్రకు ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా హిమా చల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాటలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనకబడిన ప్రాంతాలకు కూడా పన్ను రాయితీలు, కేంద్ర సబ్సిడీలు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కు బంగారుగని వంటిది, యావత్ భారతదేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన ప్రాంతమైన హైద్రాబాద్‌ను కోల్పోతున్న సీమాంధ్ర ప్రాంతానికి సరైన నష్టపరిహారం అందాలి. సీమాంధ్రకు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్‌‘ ప్రకటిస్తే మాక్కూడా ఏదో జరుగుతుందనే నమ్మకం వారికి కలుగుతుంది.

ఇక పరిస్థితుల్లోకి వస్తే, నేను అన్ని పార్టీలకూ మనవి చేస్తున్నా. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభజనకు సంబంధించిన ‘ఇమోషనల్’ అంశం. ఇద్దరూ తెలుగువారే- తెలంగాణకు చెందిన మిత్రులు, సీమాంధ్రకు చెందిన మిత్రులు - మనమందరమూ కలిసే వున్నాం. మనం ఒకే భాష మాట్లాడతాం. ‘‘అనేక భాషలు, వేషాలున్నా మన దేశం ఒకటే’’ (హిందీ) ‘‘భిన్నత్వంలో ఏకత్వం భారత్ యొక్క ఔన్నత్యం’’.

కులం, జాతి, లింగ, ప్రాంత, మత వైరుధ్యాలకతీతంగా ఇండియా ఒక్కటే. మనమంతా ఒక దేశం. మనం దేశాన్ని విభజించటం లేదు. పరి పాలన సౌలభ్యం కోసం, త్వరితగతిన అభివృద్ధి కోసం ఒక రాష్ట్రాన్ని మాత్రమే విభజిస్తున్నాం. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఇంతకు ముందు అనేక రాష్ట్రాల విభజన జరిగింది. అది మనసులో పెట్టుకుని, అనవసరమైన ప్రాంతీయ విద్వేషాలను పెరగనీయకూడదు. నేను రికార్డుని తేటతెల్లం చేయదలిచాను. దాదాపు అన్ని పార్టీలూ సీపీఐ (ఎం)తో సహా, ఎప్పుడో ఒకప్పుడు, రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపాయి.
 
 సీతారాం ఏచూరి: అది తప్పు.
 వెంకయ్యనాయుడు: అవును. ఆ విషయానికొస్తా. సీపీఐ(ఎం) వారు సమైక్య రాష్ట్రాన్నే మేము బలపరుస్తాం - అన్నారు. అయినా మీరు విభజిస్తామంటే మేము అడ్డం రాము అన్నారు.
 
 వైఎయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ‘‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభ జన కేంద్రం చేతుల్లో వుంది. మీరు చెయ్యాలంటే చెయ్యండి’’ అన్నారు. తెలుగుదేశం వారు ‘‘విభజన కావాలి కానీ ఇరు ప్రాంతాలకీ న్యాయం జరగాలి’’ అన్నారు. నేను కూడా అది ఒప్పుకుంటాను. ఈ విష యంలో నిజంగా నేరం చేసింది కాంగ్రెస్ పార్టీ. చూడండి నా మిత్రుడు చిరంజీవి నిలబడి ఉన్నారు. ఎందుకు? తన ప్రాంతానికి న్యాయం చేయ లేకపోతున్నారు... తన నియోజకవర్గానికి సమాధానం చెప్పుకోలేరు... అందువల్ల. ఈ అంకంలో ప్రధాన ప్రతినాయకుడు కాంగ్రెస్ పార్టీయే.
 
 2004లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. సోనియా గాంధీ, టీఆర్‌ఎస్ నాయకుడూ వేదిక పంచుకున్నారు. 2004 నుంచి 14 వరకూ పదేళ్లు, ఏం చేశారని కాంగ్రెస్ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు నిద్రపోయారని అడుగుతున్నా. ఇదే విభజన రెండేళ్ల క్రితమే మామూలుగా జరిగుంటే, ఈ స్థాయి పరిస్థితులు ఎదురయ్యేవి కావు. దురదృష్టవశాత్తూ, ఎన్నికల సందర్భంగా మీరీ పని చేస్తున్నారు. ఇంకో 45 రోజుల్లో, ఎన్నికల నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి. సహజంగానే, ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ విషయమై ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ వారు, మంత్రులూ అందరికీ అదే ఆందోళన. అందుకే బాధ్యత లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, అందర్నీ ఒప్పించి కలుపుకుపోయే విధంగా ప్రవర్తించవలసిన మంత్రి, బీజేపీ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందంటూ ఆరోపిస్తారు! ఈ దేశంలో మాటకు కట్టుబడే జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే. మేము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం. సీమాంధ్ర అభివృద్ధికీ కట్టుబడి వున్నాం.
 
 సార్! కాంగ్రెస్సే ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి. ఆయన మీ నిర్ణయానికి వ్యతిరేకం. ప్రధాని ప్రతిపాదిస్తారు. ముఖ్యమంత్రి వ్యతిరేకి స్తారు. దీన్నేమంటారో కాంగ్రెస్ వివరించగలదా... మీ ప్రతిపాదన మీ సీఎం వ్యతిరేకిస్తారు. మీ పార్టీ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తారు. మీ సభ్యులు ‘వెల్’లోకి వస్తారు. మీ మంత్రులకి వారి భవిష్యత్ మీద చింత... వారూ ‘వెల్’లోకి వస్తారు. మీరు మాత్రం బీజేపీ మీద ఆరోపణలు చేస్తారు. ఎంత ధైర్యం.
 సార్, మా పార్టీ తెలంగాణ, సీమాంధ్రలలో ఒకేమాట మీదున్నాం. తెలంగాణ ఏర్పడాలి. సీమాంధ్రకు న్యాయం జరగాలి. అదే మా మాట.
 
 సార్- మమ్మల్ని రెచ్చగొట్టినా, మా ఆఫీసుల మీద దాడులు చేసినా మేము లెక్క చెయ్యలేదు. మేము మా ప్రిన్సిపుల్ మీదే నిలబడ్డాం. శాంతి యుతమైన సోదరభావంతో కూడుకున్న విభజన కోరుకున్నాం. సీమాంధ్ర ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. (తెలుగులో) తెలంగాణ సీమాంధ్ర బిడ్డలు శాంతియుతంగా కలిసి జీవించాలని కోరుకుం టున్నాను.
 
 డిప్యూటీ చైర్మన్: థాంక్యూ వెంకయ్యజీ, థాంక్యూ.
వెంకయ్యనాయుడు: నేను కోరుకునేది శాంతి, సోదరభావంతో కూడిన విభజన. సమంజసమైన విభజన, మా నాయకుడు నరేంద్రమోదీ హైద్రాబాద్‌లో ఇటీవల జరిగిన మీటింగ్‌లో జై తెలంగాణ! జై సీమాంధ్ర అన్నారు. తెలంగాణ ప్రజలంతా కేరింతలు కొట్టారు. అలా ఉండాలి నాయ కత్వమంటే, ఈ దేశంలోనే అతి ఉన్నతమైన నాయకుడు లాల్ కృష్ణ అద్వా నీగారు, మా బీజేపీ నేత, ఈ విభజన ప్రజాస్వామ్యయుతంగా, శాంతియు తంగా జరగాలని కోరుకున్నారు- ఉన్మాద పద్ధతిలో కాదు! విషయం తిన్నగా చెప్తున్నా, మా పార్టీది ఒకేగళం. న్యాయం అడగటంలో తప్పులేదు.

- ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement