'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు' | ysrcp leader pardhasaradhi fires on ap cm over special status | Sakshi

'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు'

Published Sat, May 21 2016 3:08 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు' - Sakshi

'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు'

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబును చూసి తుపానే కాదు మబ్బులు కూడా పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఇప్పటికే హోదా పొందిన 11 రాష్ట్రాల్లో అభివృద్ధి లేదనడం అవివేకమన్నారు. అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోటీపడుతున్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల హక్కులను బాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రమైనా తెలంగాణలోఅక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేని అసమర్థుడని విమర్శించారు. కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement