22 లేదా జనవరి 5న టెట్! | `Teachers' Eligibility Test` exam to be held on December 22, or January 5 | Sakshi
Sakshi News home page

22 లేదా జనవరి 5న టెట్!

Published Fri, Dec 6 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

`Teachers' Eligibility Test` exam to be held on December 22, or January 5

 గుంటూరు, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 29న టెట్‌ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ 3న ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే అదే రోజు‘నెట్’ పరీక్ష ఉన్నందున ఈ మార్పు చేయాలని భావిస్తోంది. దీనిపై ఒకటీరెండు రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెకండరీ విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.
 
 ఫిబ్రవరిలో డీఎస్సీ: మంత్రి పార్థసారథి
 వచ్చే ఫిబ్రవరి 15నాటికి డీఎస్సీ పరీక్ష నిర్వహించి అదే నెల చివరల్లో ఫలితాలు ప్రకటిస్తామని సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement