
కేసీఆర్‌కు భయపడే చంద్రబాబు..
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం చంద్రబాబు పెట్టినవి అయిదు సంతకాలు కావని, అయిదు వెన్నుపోట్లు అని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబావబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని అన్నారు. కేసీఆర్‌కు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయారన్నారు.
చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, 600 హామీల్లో ఏ ఒక్కటీ ఆయన అమలు చేయాలేదని విమర్శించారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు పెరిగాయన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాజధాని భూముల కుంభకోణం, ఉచిత ఇసుక, చెట్టు-నీరు, పోలవరం, పట్టిసీమ, విశాఖలో భూకబ్జాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.