సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరం చేపల మార్కెట్, పాత బస్టాండ్‌లను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇరిగేషన్ సైట్లో ఉన్న గంగాలమ్మ చేపల మార్కెట్ వ్యాపారుల వద్ద టీడీపీ నాయకులు అన్యాయంగా పన్నులు వసూలు చేస్తున్నారనే విషయంపై భీమవరం ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్రమంగా పన్ను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ప్రైవేటు బస్సులకు అడ్డాగా మారిన పాత బస్టాండ్‌లోని బస్సులను తొలగించి, మళ్లీ ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment