ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: గ్రంధి శ్రీనివాస్‌ | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: గ్రంధి శ్రీనివాస్‌

Published Mon, Mar 11 2024 11:02 AM

YSRCP Grandhi Srinivas Serious Comments On Andra Jyothi Paper - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమైనట్టు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని తన పరువుకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి చెత్త రాతలు రాసిందన్నారు. వారి రాతలపై కోర్టు వచ్చి నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. 

కాగా, గ్రంధి శ్రీనివాస్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రైతులకు సొంత డబ్బు ఇచ్చి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చాము. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలంటే 180 ఎకరాల భూమి కావాలి కానీ 75 ఎకరాల భూమిని దొరికింది. ఆంధ్రజ్యోతి పత్రికలో భూములు ఎక్కువ ధరలు ఇచ్చేసారని మా బంధువులకు తొమ్మిది కోట్ల రూపాయలు లాభం పొందామని అక్రమాలు చేశామని తప్పుడు రాతలు రాసుకొచ్చారు. మా పరుపుకి భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి రాతలు రాసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా బురద చల్లాల్నే రాతలు రాస్తున్నారు. 

ప్రజలకు సేవ చేయడం నేరమా?..
వంద పడకల ఆసుపత్రికి నాలుగు ఎకరాలు మా సొంత భూమి ఇచ్చాము. జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం మా సొంత భూమి ఇచ్చాము. నన్ను డామేజ్ చేయాలని ఎన్నో అవాస్తవాలను రాసింది. ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. పూర్తి ఆధారాలతో కోర్టుకి వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాము. లేఅవుట్స్‌, మట్టి పూడికలు, బిల్డింగ్ పర్మిషన్ల అంశంలో నా ప్రమేయాలు ఉన్నట్లు వక్రీకరించారు. ప్రజలకు మేము సేవ చేయడం నేరమా?. వారు మా దగ్గరికి వచ్చి అడగటం నేరమా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు ప్లాట్లు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్లు జరగకపోతే వారి తరఫున నిలబడితే దీన్ని కూడావక్రీకరించారు. ప్రజలకు మంచి చేస్తున్నాము కాబట్టే.. ఇలాంటి రాతలు రాస్తున్నారు.

ఎల్లో మీడియాకు బాబు స్కామ్‌లు కనిపించవా?
చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 850 ఎకరాల్లో లక్ష కోట్ల కుంభకోణం చేశాడు. దీనిపై సీబీఐ విచారణ వేయమంటే మాకు సిబ్బంది లేరు అని నాడు వారు చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడో అది ఆంధ్రజ్యోతికి కనపడదు. చంద్రబాబు అవినీతి లక్ష కోట్ల కుంభకోణం మీద ఎక్కడైనా రాశారా?. ఎల్లో మీడియా రైతులు, పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా రాతలు రాస్తుంది. చంద్రబాబును గద్దెనెక్కించడం కోసం.. అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా పనిచేసే మాలాంటి వారిని అల్లరి చేయాలని చూస్తున్నారు. 

దగా, వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మోసం చేయడం, దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు మామూలే. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావని చంద్రబాబుకు తెలిసింది. అందుకే అందరితో పొత్తులు పెట్టుకుంటున్నాడు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షాన నిలుస్తూ పొత్తులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. చెప్పాడంటే చేస్తాడు.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement