
సాక్షి, పశ్చిమ గోదావరి: జనాలను మోసం చేసే పార్టీ జనసేన అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. పేదలు సుఖంగా ఉంటే పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా? అని పవన్‌ను ప్రశ్నించారు.
కాగా, గ్రంధి శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ. పవన్ ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మహోన్నతుల పేర్లు ఉచ్చరించి నీచమైన రాజకీయం చేస్తున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా?. పవన్ కుటిల రాజకీయం గమనించి 2019లోనే ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు మీకోసం భీమవరంలో సభ పెట్టలేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు