సమైక్యవాద ముసుగులో ఉన్న విభజనవాది రఘురామ కృష్ణంరాజు అని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు.
సమైక్యవాద ముసుగులో ఉన్న విభజనవాది రఘురామ కృష్ణంరాజు అని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని, తెలంగాణ ఏర్పాటుకు కూడా కట్టుబడి ఉన్నామని చెప్పిన బీజేపీలోకి ఇప్పుడు ఆయనెలా వెళ్లారని ప్రశ్నించారు.
వ్యాపార భాగస్వాములను, ప్రజలను కూడా రఘురామ కృష్ణంరాజు మోసం చేస్తున్నారని, ఆయన నిజస్వరూపం ఇన్నాళ్లకు బయటపడిందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.