
టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు.
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి.
భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు.
చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర!