
సాక్షి, కృష్ణా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు.
ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నల్లబెలూన్లు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్‌పాల్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ నేతలు నల్లబెలూన్లను ఎగురవేశారు. ప్రధాని భద్రతా విషయంలో ఎలాంటి వైఫల్యం లేదు. ఇప‍్పటికే కాంగ్రెస్ నేత సుంకర పద‍్మ, సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశాము. మిగతా వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తాము’’ అని అన్నారు.
అనంతరం, ఏపీలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కుట్ర పన్నిన దుష్టశక్తులను గుర్తించాలి. కాంగ్రెస్ నేతలపై చర‍్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment