ఘనత సాధించిన రేడియో విష్ణు 90.4. వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన వంద మంది రేడియో జాకీల్లో 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు.
‘గుడ్ మార్నింగ్... భీమవరం. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం’ అంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, వాతావరణం.. ఇలా నిరంతర సమగ్ర సమాచారాన్ని శ్రావ్యమైన గొంతుతో ప్రజాపయోగకరమైన వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్ల పటు నిరంతర ప్రసారంలో అనర్గళంగా మాట్లాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
కమ్యూనిటీ రేడియో !
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్య కేంద్రీకృత, చర్చా ఆధారిత తొలి రేడియో స్టేషన్‌గా ఈ కమ్యూనిటీ రేడియో గుర్తింపు పొందింది. సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రసారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘ రేడియో ప్రసారం 66 గంటల 6 నిముషాల 1 సెకనుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది.
15 ఏళ్లుగా గొంతు వినిపిస్తోంది!
విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్ పెంపొందించడం లక్ష్యంగా భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో చైర్మన్ కేవీ విష్ణురాజు 2007 సంవత్సరంలో రేడియో విష్ణు ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.
– విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment