
సాక్షి, భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన సుంకర సుధీర్ ఒక ప్రైవేటు టెలివిజన్ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ షోకు ఎంపికయ్యాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన సుధీర్ మిమిక్రీలో బంగారు పతకం సాధించి ఆర్‌జే సూర్యగా గుర్తింపు పొందాడు.
పట్టణంలోని 15వ వార్డు అమ్మిరాజు తోటకు చెందిన సుంకర సత్యనారాయణ కుమారుడైన సుధీర్ ఎం.కామ్. వరకు చదివి పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. బిగ్‌బాస్ కార్యక్రమానికి సుధీర్ ఎంపిక కావడంపై పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: (బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్)