బిగ్‌బాస్ షోలో ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు ఆర్జే సూర్య. కానీ కష్టానికి అదృష్టం తోడవకపోవడంతో షో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ.. 'మా అమ్మ బీడీలు చుట్టేది. నాన్న తాపీ పని చేస్తాడు. ఆయన పనికి వెళ్తేనే మాకు పూట గడిసేది. ఏరోజూ సెలవు తీసుకునేవాడు కాదు. వాళ్లే నా ఇన్‌స్పిరేషన్. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు పాన్ షాప్‌లో సోడా బాటిళ్లు క్లీన్ చేసేవాడిని. రోజుకు పది రూపాయలిచ్చేవారు. అదే నా మొదటి జీతం.
పీజీలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రపోజ్ చేశాను, ఒప్పుకుంది. పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోతే ఆత్మహత్యాయత్నం చేశా. దీంతో అమ్మ వచ్చి అమ్మాయివాళ్లతో మాట్లాడింది. కాకపోతే చదువు అయిపోయేవరకు మీ ఇద్దరూ ఫోన్లు మాట్లాడుకోవద్దు, కలుసుకోకూడదని కండీషన్ పెట్టారు. చదువైపోయాక కూడా మీ మధ్య ఇదే ప్రేముంటే పెళ్లి చేస్తామన్నారు. సరేనన్నాం. అంతా సెట్టయిపోయిందని కలల ప్రపంచంలో తేలిపోయా. రెండు నెలలు గడిచిపోయాయి. కట్ చేస్తే ఫస్ట్ ఇయర్ హాలీడేస్‌లో ఓరోజు అమ్మాయి ఫోన్ చేసింది. మా ఇంటికి మీ అమ్మగారు వచ్చినప్పుడు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, మీ నాన్నయితే అసలు రానే లేదు. నాకేదో తేడా కొడుతోంది. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే మీ పేరెంట్స్‌ను వదిలేసి మా ఇంటికి వచ్చేసి మాతోనే ఉండిపో అని చెప్పింది. నాకేం అర్థం కాలేదు, ఫోన్ పగలగొట్టాను.
ఇంటికి వెళ్లి తలుపులు మూసి అమ్మ కాళ్ల మీద పడి తప్పయిపోయిందమ్మా అంటూ మూడుగంటలపాటు వెక్కివెక్కి ఏడ్చాను. గుండెల మీద పెంచినవాళ్లను గుండెల మీద తన్నాను, అయినా అమ్మ వెంటనే క్షమించేసింది. ఆ తర్వాతి రోజే చెన్నై రెడ్ ఎఫ్‌ఎమ్ నుంచి ఫోన్ వచ్చింది. హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారు. చదువు మానేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. తర్వాత ఆర్జేగా, యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్‌లో నటుడిగా రాణించాను' అని చెప్పుకొచ్చాడు సూర్య.
చదవండి: చివరి నిమిషంలో ట్విస్ట్, బాలాదిత్యతోపాటు వాసంతి అవుట్
గీతూ ఎలిమినేషన్‌కు నేను కారణం కాదు: బాలాదిత్య
Comments
Please login to add a commentAdd a comment