Bigg Boss 6 Telugu: RJ Surya Gives Clarity On His Relationship With Bujjamma - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయకు లైన్‌ క్లియర్‌?

Published Thu, Nov 3 2022 5:07 PM | Last Updated on Fri, Nov 4 2022 11:25 PM

Bigg Boss 6 Telugu: RJ Surya Clarifies About His Relationship With Bujjamma - Sakshi

ఆర్జే సూర్య బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ప్రవర్తించింది ఇనయ. అతడితో కాసేపు బాగానే ఉంటుంది. అంతలోనే నీ ఫ్రెండ్‌షిప్‌ వద్దు, నువ్వూ వద్దు. నిన్ను నామినేట్‌ చేసి పడేస్తా అని కోపం చూపించింది. వీళ్ల లెక్కలు అర్థం కాక ఇనయకు తిక్క అనుకున్నారు హౌస్‌మేట్స్‌. కానీ ఎప్పుడైతే సూర్య ఎలిమినేట్‌ అయ్యాడో అప్పుడు సీన్‌ రివర్సైంది. నీవల్లే సూర్య వెళ్లిపోయాడు, నువ్వే పంపించావు, వెన్నుపోటు పొడిచావు అంటూ హౌస్‌ అంతా నానామాటలు అంది. అయినా సరే, ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని అందరితో పోరాడింది ఇనయ.

ఇక సూర్య వెళ్లిపోయిన క్షణం నుంచి అతడి నామస్మరణలోనే ఉంటోంది. అలా అని గేమ్‌ను నిర్లక్ష్యం చేయట్లేదు. సూర్య గేమ్‌ కూడా కలిపి ఆడుతోంది. అతడి టీషర్టే వేసుకుని ఆటాడింది. అతడి ప్లేట్‌లోనే తింటోంది, అతడి కప్‌లోనే కాఫీ తాగుతోంది. ఎవరెన్ని అంటున్నా సూర్య అంటే ఇష్టం అని గొంతెత్తి అరుస్తోంది. మరి ఇంత ప్రేమున్న ఇనయ సూర్య హౌస్‌లో ఉన్నప్పుడు అతడిని ఎందుకు దూరం పెట్టింది? అంటే బుజ్జమ్మే కారణం. సూర్యకు ఆల్‌రెడీ బుజ్జమ్మ అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నప్పుడు తను అతడికి దగ్గరవడం తప్పనుకుని దూరం పెట్టాలనుకుంది. కానీ అతడు వెళ్లిపోయాక మాత్రం నిత్యం సూర్య పేరు తలుచుకుంటూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది.

అయితే సూర్యకు అసలు గర్ల్‌ఫ్రెండే లేదట. బుజ్జమ్మకు, తనకు మధ్య స్నేహం మాత్రమే ఉందని వివరించాడు సూర్య. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'బుజ్జమ్మ నా గర్ల్‌ఫ్రెండ్‌ కాదు, క్లోజ్‌ఫ్రెండ్‌ మాత్రమే. 8 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాము. దయచేసి మాగురించి తప్పుగా రాయకండి. నాకు ఆల్‌రెడీ పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడే ఆ మాట చెప్పాను. కానీ అది ఎపిసోడ్‌లో చూపించలేదేమో!' అని క్లారిటీ ఇచ్చాడు. ఇది చూసిన జనాలు ఇనయ లైన్‌ క్లియర్‌ అయినట్లే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అంత ప్రేముంటే వెళ్లి సూర్య ఇంట్లో కూర్చోమను
అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతిరత్నాలు డైరెక్టర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement