బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌లో ఈవారం ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి సూర్య గేమ్ ఆడాడు, ఎంటర్‌టైన్ చేశాడు.. కానీ అతడి లవ్ ట్రాకుల వల్ల చెడ్డ పేరు మూటగట్టుకుని బయటకు వచ్చేశాడు. మొదట్లో ఆరోహితో, ఆమె వెళ్లిపోగానే ఇనయతో క్లోజ్‌గా ఉండటంతో అతడికి పులిహోర రాజా అని సర్టిఫికెట్ ఇచ్చారు నెటిజన్లు. అయితే తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదంటున్నాడు సూర్య.
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చేసిన అతడు యాంకర్ శివతో బిగ్‌బాస్ కెఫెలో ముచ్చటించాడు. ఈ సందర్భంగా శివ తను అడగాలనుకున్న ప్రశ్నలన్నింటిని వరుసపెట్టి అడిగి కడిగిపారేశాడు. ఫెమినిస్ట్ పాయింట్ ఎత్తడానికి, నువ్వు ఆడిన విధానానికి అసలేమైనా సంబంధం ఉందా? అని అడిగాడు. దీనికి సూర్య.. నా దృష్టిలో ఫెమినిస్ట్ అంటే ఆడవాళ్ల ఆలోచనలకు ఎక్కువ గౌరవం ఇవ్వడమని ఆన్సరిచ్చాడు. మరి నువ్వు వాల్యూ ఇచ్చావా? అని అడగ్గా హా, ఇచ్చానంటూ తలూపాడు సూర్య. అలాగైతే ఆల్‌రెడీ కెప్టెన్ అయిన నువ్వు వాసంతికి ఒకసారి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎందుకివ్వలేదని నిలదీశాడు.
ఒకప్పుడు ఆరోహితో క్లోజ్‌గా ఉండి సురోహిగా.. తర్వాత ఇనయతో క్లోజ్‌గా ఉంటూ సునయగా ఆడావు. నెక్స్ట్ కీర్తియా? అని ప్రశ్నించడంతో ఖంగు తిన్నాడు సూర్య. ఇనయను మోటివేట్ చేయడానికి తనతో ఎక్కువగా ఉన్నానని ఆన్సరిచ్చాడు ఆర్జే. అయినా నేనెవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లతో ముడిపెట్టేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. అలాగైతే.. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో మీరే తెలుసుకోండంటూ మీమ్స్ చూపించాడు శివ. ఇందులో సూర్య హగ్గులు, ముద్దులు పెడుతున్న ఫొటోలను పెట్టి వరల్డ్ బిగ్గెస్ట్ ఫెమినిస్ట్, ఫ్రీ హగ్స్ అంటూ రాసుకొచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే సూర్యకు మరో దిమ్మతిరిగిపోయే వీడియో చూపించాడు శివ. అందులో ఇనయ.. సూర్య ఫేక్ అనిపించాడంటూ మాట్లాడింది. ఆ మాటలతో సూర్య బిత్తరముఖం వేసుకున్నాడు.
చదవండి: తల్లి కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య
సూర్య- ఇనయ లవ్ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్
Comments
Please login to add a commentAdd a comment