
బిగ్‌బాస్ షోలో ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయింది. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇకపోతే షో నుంచి ఎగ్జిట్ అయిన ఇనయ బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అతడు అడిగే ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలిచ్చింది.
ప్రతిసారి టైటిల్ విన్నర్ నేనే అని ఎందుకు అరిచేదాని? అని శివ ప్రశ్నించగా నా మీద నాకున్న నమ్మకంతోనే అలా అన్నానని చెప్పింది. సూర్యతో లవ్ ట్రాక్ వల్ల నీ గ్రాఫ్ తగ్గింది అని శివ చెప్పగా అతడిని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అని తిరిగి ప్రశ్నించింది. ఊహించని ప్రశ్నతో అవాక్కయ్యాడు శివ. సూర్య గురించి రేవంత్ దగ్గర ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేశావని అడగ్గా.. అది బ్యాక్ బిచ్చింగ్ కాదు, అప్పుడు కోపంలో అలా చెప్పానని ఆన్సరిచ్చింది. అంటే నీకు నచ్చినప్పుడు బాగా మాట్లాడతావు, నచ్చకపోతే ఎన్ని స్టేట్‌మెంట్లైనా వదులుతావు, అంతేనా? అని శివ సెటైర్ వేయగా.. ఎన్ని స్టేట్‌మెంట్లు కాదు, అప్పుడనిపించింది మాత్రమే చెప్తాను అంటూ కౌంటరిచ్చింది.
రేవంత్ గురించి చెప్పమని శివ అడగడంతో అతడు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడంది ఇనయ. అచ్చం నీలాగే కదా అని యాంకర్ సెటైర్ వేయగా తన గురించి అడిగినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అని మండిపడింది. నేనూ, తను ఒకేలా ప్రవర్తిస్తామా? అని ప్రశ్నించగా నాకు తెలీదని బదులిచ్చాడు శివ. మరి తెలియనప్పుడు నా గురించి ఎందుకు చెప్పావని ఎదురు తిరిగింది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు 'ఇనయ రాక్స్, యాంకర్ శివ షాక్స్', 'శివకు ఇనయ మాత్రమే కౌంటర్ ఇవ్వగలదు', 'లాస్ట్ కౌంటర్ అదిరిపోయింది', 'ప్రతి ఒక్కరినీ చులకన చేసి మాట్లాడుతున్న శివకు ఇనయ సరిగ్గా జవాబిచ్చింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: జర్నీ చూసి భావోద్వేగానికి లోనైన రేవంత్, శ్రీసత్య
మిడ్ వీక్ ఎలిమినేషన్, అతడే టైటిల్ గెలవాలన్న ఇనయ
Comments
Please login to add a commentAdd a comment