Bigg Boss Telugu 6 Contestant Inaya Sultana Marriage Photos Viral - Sakshi
Sakshi News home page

Inaya Sultana Marriage: ఇనయాకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్‌ అవుతున్న ఫోటో

Published Fri, Dec 16 2022 12:54 PM | Last Updated on Fri, Dec 16 2022 1:26 PM

Bigg Boss 6 Lady Tiger Inaya Sultana Marraige Photo Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6కి లేడీ టైగర్‌ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్‌ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్‌ అయిన ఇనయా నెగిటివ్‌ ఇమేజ్‌తోనే వెళ్లింది. ప్రేక్షకులు సహా ఇంటిసభ్యులు కూడా ఇనయా గురించి తక్కువ అంచనా వేశారు. మహాఅయితే రెండు, మూడు వారాల్లో ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది.

హౌస్‌ మొత్తం టార్గెట్‌ చేసినా, ప్రతిసారి ఎలిమినేషన్స్‌కి పంపినా అంతకు రెట్టింపు ధైర్యంతో ఆటతీరు ప్రదర్శించింది. ఇదేతీరు ఆడియెన్స్‌ను కూడా బాగా అట్రాక్ట్‌ చేసింది. ఫినాలేలో టాప్‌-2 కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న ఇనయా అనూహ్యంగా గతవారం ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. కావాలనే ఇనయాను బయటకు పంపించారంటూ పెద్ద ఎత్తున​ విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఇనయాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. పెళ్లికూతురిగా ముస్తాబైన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇనయా తల్లి కూడా పక్కనే ఉంది. దీంతో ఇనయాకు ముందే పెళ్లయిందా? అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు కావాలనే ఇనయా క్రేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే స్వయంగా ఇనయానే ఈ ఫోటోపై స్పందించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement