wedding photo
-
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్‌లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
విడాకులు తీసుకున్నారా? మరి పెళ్లి ఫోటోల సంగతేంటి?
ఫొటోలు బాగా తీసే స్టూడియోలున్నట్లే.. ఫొటో హార్డ్ కాపీలను చిత్తు చిత్తుగా చించేసే స్టూడియో కూడా ఉంది.. రష్యాలో! పెళ్లి ఫెయిలై.. విడాకులు తీసుకున్న చాలామంది దంపతులు తమ పెళ్లి ఫొటో హార్డ్ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్ అడ్డొచ్చి, బయట పడేస్తే ఆ ఫొటోలను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంటుందని భయపడి.. ఇలా రకరకాల కారణాలతో వాటిని ఏమీ చేయలేక.. అలాగని ఇంట్లో పెట్టుకోనూలేక సతమతమవుతుంటారు. ఆ బాధను అర్థం చేసుకున్న లియు బైలు అనే వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటే చేశాడు ‘వెడ్డింగ్ ఫొటోస్ ష్రెడింగ్ బిజనెస్’ స్టూడియోతో! డైవోర్స్ తీసుకున్న కపుల్స్ తమ పెళ్లి ఫొటోలను ఈ స్టూడియోకి తెచ్చిస్తే.. ఫోటోలను స్ప్రే పెయింట్‌తో కప్పేసి.. వాటిని ష్రెడింగ్ మెషిన్లో వేసి నుజ్జు నుజ్జు చేసేస్తాడట. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి ఆ ఫుటేజ్‌ని క్లయింట్‌కు పంపుతాడు. ఇప్పుడు ఇతని స్టూడియోకి విపరీతమైన గిరాకీ పెరిగి మూడు ఫొటోలు ఆరు రూబుళ్లుగా బిజినెస్ సాగుతోందట. -
బిగ్‌బాస్ లేడీ టైగర్ ఇనయాకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో
బిగ్‌బాస్ సీజన్-6కి లేడీ టైగర్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా నెగిటివ్ ఇమేజ్‌తోనే వెళ్లింది. ప్రేక్షకులు సహా ఇంటిసభ్యులు కూడా ఇనయా గురించి తక్కువ అంచనా వేశారు. మహాఅయితే రెండు, మూడు వారాల్లో ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. హౌస్ మొత్తం టార్గెట్ చేసినా, ప్రతిసారి ఎలిమినేషన్స్‌కి పంపినా అంతకు రెట్టింపు ధైర్యంతో ఆటతీరు ప్రదర్శించింది. ఇదేతీరు ఆడియెన్స్‌ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది. ఫినాలేలో టాప్-2 కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న ఇనయా అనూహ్యంగా గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కావాలనే ఇనయాను బయటకు పంపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇనయాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పెళ్లికూతురిగా ముస్తాబైన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇనయా తల్లి కూడా పక్కనే ఉంది. దీంతో ఇనయాకు ముందే పెళ్లయిందా? అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు కావాలనే ఇనయా క్రేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే స్వయంగా ఇనయానే ఈ ఫోటోపై స్పందించాల్సి ఉంటుంది. -
జీవితాంతం నువ్వు నా దానివే..: దర్శకుడు
కొత్త సంవత్సరం.. మరింత కొంగొత్తగా మొదలు పెట్టారు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. తన కలల రారాణి అలీసియాని జీవితంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ కొత్త మజిలీని మొదలు పెట్టారు. ఆమె వెన్నంటే తిరుగుతూ సంతోషాల హరివిల్లులో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు.. భార్య చేయి పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేస్తూ తనకు షాదీ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నాడు ఆమెతో మరింత దగ్గరగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మనసులోని భావాలను బయటపెట్టారు. (చదవండి: 'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') "14 వందల ఏళ్ల క్రితం ఇమామ్ అలీ.. ఫాతిమాతో ఏమన్నాడో తెలుసా? నిన్ను చూస్తే చాలు.. నా బాధలు, భయాలు అన్నీ ఏదో మంత్రం వేసినట్లుగా మటుమాయవుతాయి అని! సరిగ్గా ఇప్పుడు నాక్కూడా అదే అనిపిస్తోంది అలీసియా. నిన్ను చూస్తే నా బాధరబందీలు అన్నీ మర్చిపోయి మనసంతా హాయిగా ఉంటోంది. ఏదేమైనా జీవితాంతం నువ్వు నాదానివే.." అంటూ భార్య మీద ప్రేమను కురిపించారు. కాగా అలీ అబ్బాస్ జాఫర్ కేవలం దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సుల్తాన్, టైగర్ జిందా హై, భారత్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తాండవ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుండగా, దీనికి హిమాన్షు కిషన్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డింపుల్ కపాడియా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేశ రాజకీయాల నేపథ్యంలో సాగనున్న ఈ వెబ్ సిరీస్ జనవరి 15 నుంచి ప్రసారం కానుంది. (చదవండి: దీపిక ఎందుకిలా చేసింది?: ఫ్యాన్స్ కంగారు) View this post on Instagram A post shared by Ali Abbas Zafar (@aliabbaszafar) -
అమ్మ చీరలో పెళ్లి కూతురు
ప్రస్తుతం పెళ్లి సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు నిహారిక. ఈ వేడుకల్లో భాగంగా కట్టుకున్న ఓ చీరను చూసుకుని మురిసిపోతున్నారు. కారణం ఆ చీరకున్న స్పెషాలిటీయే. నిహారిక తల్లి పద్మజ నిశ్చితార్థంలో కట్టుకున్న చీరను ఇప్పుడు తన పెళ్లి సంబరాల్లో కట్టుకున్నారు నిహా. అప్పటి తన తల్లి ఫోటోను, అమ్మ చీరను కట్టుకుని ఇప్పుడు తాను దిగిన ఫొటోను పక్కపక్కనే పెట్టి, ఓ ఫొటోగా షేర్ చేశారు. ‘‘మా అమ్మ నిశ్చితార్థం అప్పటి చీర ఇది. 32 ఏళ్ల నాటి చీర’’ అని క్యాప్షన్ చేశారు నిహారిక. ‘‘మా ఆవిడ అందంగా ఉంది. కానీ నా కూతురు మాత్రం యువరాణిలా ఉంది’’ అని నాగబాబు కామెంట్ చేశారు. వెంకట చైతన్యతో ఈ నెల 9న నిహారిక వివాహం జరగనుంది. -
ఆలియాకి పెళ్లైపోయిందా!
గాసిప్ అయితే సినిమాలతో... లేదంటే పాటలతో న్యూస్‌లో ఉండే ఆలియాభట్... తాజాగా ఓ ఊహించని విషయానికి వార్తల్లోకొచ్చింది. ఉన్నట్టుండి పలు వెబ్సైట్లలో ఆమె పెళ్లి ఫొటో ప్రత్యక్షమవడంతో వార్తల్లోని వ్యక్తి అయిపోయింది. పెళ్లిదుస్తులు ధరించి, సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో పాటు కారులో వెళ్తోన్న ఆ ఫొటోని చూసి ఆమె అభిమానులంతా అవాక్కయ్యారు. అసలే ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని రూమర్ కూడా ఉందేమో, వాళ్లు పెళ్లిగానీ చేసేసుకున్నారా అని సందేహపడ్డారు. అయితే అది నిజమైన పెళ్లి కాదని, కోకో కోలా యాడ్‌లోని షాట్ అని తెలిసి ఆనక ఊపిరి పీల్చుకున్నారు. -
నెట్లో త్రిష పెళ్లి ఫొటో
ట్విట్టర్ అకౌంట్స్లతో తుంటరి అభిమానులే కాదు త్రిషలాంటి నటీమణులు ప్రేక్షకులతో ఆడుకుంటుంటారు. ఈ మధ్య పెళ్లి ఫొటోను ఇంటర్నెట్లో ప్రచారం చేసిన నటి చార్మి అందరికీ షాక్ ఇచ్చారు. చివరికి ఆ ఫొటో తాను నటిస్తున్న టాలీవుడ్ చిత్రం జ్యోతిలక్ష్మి లోనిదని తెలిసింది. త్రిష కూడా అభిమాను లకు ఇటీవల షాక్ ఇచ్చారు. త్రిష ఈ మధ్యనే నిర్మాత, వ్యాపారవేత్త అరుణ్మనియన్తో ప్రేమ వివాహానికి సిద్ధం అయ్యారు. వీరి నిశ్చితార్థం కూడా నిరాడంబరంగా జరిగిపోయింది. ఇక పెళ్లి పీటలెక్కడమే తరువాయి. కాగా అదెప్పుడనే ప్రశ్న పరిశ్రమలో చర్చనీయాంశమైంది. కారణం గత మార్చి నెలలోనే త్రిష వివాహం జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే త్రిష తాను అంగీకరించిన చిత్రాలు పూర్తి చేసే వరకు వివాహాన్ని వాయిదా వేయాలని నిర్మాతల విజ్ఞప్తి మేరకు త్రిష వివాహ తేదీని నిర్ణయించలేదని సమాచారం. నిశ్చితార్థానికి ముందు ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేస్తూనే కొత్త చిత్రాలకు వరుసగా అంగీకరిస్తుండడం చాలామందిని ఆలోచనల్లో పడేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో త్రిష పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫోటోను నెట్లో పోస్ట్ చేశారు. దీంతో త్రిష వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లి ఫోటోనే ఆమె నెట్లో పోస్ట్ చేశారు అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ఫొటో త్రిష తాజా చిత్రం లోనిదన్న విషయం ఆ తరువాత తెలియవచ్చింది. అయితే ఇప్పుడా ఫొటోను నెట్లో ప్రచారం చేయడంలో త్రిష మతలబు ఏమిటబ్బా అని ఆరాలు తీసే పనిలో పడింది కోలీవుడ్.