అమ్మ చీరలో పెళ్లి కూతురు | Niharika Wears Her Mother Engagement Saree | Sakshi

అమ్మ చీరలో పెళ్లి కూతురు

Dec 7 2020 12:14 AM | Updated on Oct 17 2021 1:52 PM

Niharika Wears Her Mother Engagement Saree - Sakshi

ప్రస్తుతం పెళ్లి సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు నిహారిక. ఈ వేడుకల్లో భాగంగా కట్టుకున్న ఓ చీరను చూసుకుని మురిసిపోతున్నారు. కారణం ఆ చీరకున్న స్పెషాలిటీయే. నిహారిక తల్లి పద్మజ నిశ్చితార్థంలో కట్టుకున్న చీరను ఇప్పుడు తన పెళ్లి సంబరాల్లో కట్టుకున్నారు నిహా. అప్పటి తన తల్లి ఫోటోను, అమ్మ చీరను కట్టుకుని ఇప్పుడు తాను దిగిన ఫొటోను పక్కపక్కనే పెట్టి, ఓ ఫొటోగా షేర్‌ చేశారు. ‘‘మా అమ్మ నిశ్చితార్థం అప్పటి చీర ఇది. 32 ఏళ్ల నాటి చీర’’ అని క్యాప్షన్‌ చేశారు నిహారిక. ‘‘మా ఆవిడ అందంగా ఉంది. కానీ నా కూతురు మాత్రం యువరాణిలా ఉంది’’ అని నాగబాబు కామెంట్‌ చేశారు. వెంకట చైతన్యతో ఈ నెల 9న నిహారిక వివాహం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement