ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. ఈ మాట ఊరికే అనలేదు.. ఈ రెండూ చేయాలంటే మాటలు కాదు మూటలు కావాలి. అలాగే ముందుచూపు కూడా ఉండాలి. పెళ్లి విషయంలో అయితే మొదటి నుంచి ముందుగా ప్లాన్ చేసుకుని పక్కాగా ముందుకు వెళుతుంటారు. సెలబ్రిటీలైతే డబ్బుకు ఢోకా ఉండదు కాబట్టి, మనీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా హెయిర్ కలర్ దగ్గర నుంచి కాలి నెయిల్ పాలిష్ దాకా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. పెళ్లి చూపుల నుంచి గ్రాండ్ రిసెప్షన్ దాకా అన్నీ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అంతే! ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఇద్దరు లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు. కానీ హంగూ ఆర్భాటలకు పోకుండా కాస్త సింపుల్‌గా ఉండేందుకే మొగ్గు చూపారు. ఎంగేజ్‌మెంట్ వేడుకలో వరుణ్ తేజ్ కుర్తా-పైజామాలో సింప్లీ సూపర్బ్ అనిపించాడు. అటు లావణ్య కూడా వరుణ్‌కు తగ్గట్లుగానే రెడీ అయింది. ఆకుపచ్చని బనారస్ చీర ధరించిన ఆమె దానికి మ్యాచింగ్ గాజులు, చోకర్ పెట్టుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
వరుణ్ తేజ్- లావణ్యల నిశ్చితార్థం ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తనను మరింత అందంగా మలిచిన ఈ చీర ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 75 వేల రూపాయలు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెళ్లి కూతురు అంటే ఆమాత్రం ఉండాలి, అందులోనూ మెగా ఇంటి కోడలు కాబోతుందంటే చీరకు లక్ష పెట్టినా తక్కువే అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఉపాసన డ్రెస్ ధర రూ.19,000 అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment