నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. చెల్లెలి పెళ్లి వేడుకలను వరుణ్ తేజ్ ప్లాన్ చేస్తున్నారట. నిహారిక పెళ్లి గురించి నాగబాబు తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ– ‘‘నిహారిక పెళ్లి విషయంలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి కఠిన (కరోనాని ఉద్దేశించి) సమయంలో తన పెళ్లి మాకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. పెళ్లి పనులతో వరుణ్ తేజ్ చాలా బిజీ అయిపోయాడు. నిహారిక–చైతన్య పెళ్లి డిసెంబర్ నెలలో జరుగుతుంది. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. వరుణ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల జాబితాను తయారు చేశాడు. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment