జీవితాంతం నువ్వు నా దానివే..: దర్శకుడు | Ali Abbas Zafar About Wife Alicia: Mine For Life | Sakshi
Sakshi News home page

నీ మోము చూస్తే చాలు టెన్షన్లన్నీ మాయం..

Jan 5 2021 1:22 PM | Updated on Jan 5 2021 6:16 PM

Ali Abbas Zafar About Wife Alicia: Mine For Life - Sakshi

కొత్త సంవత్సరం.. మరింత కొంగొత్తగా మొదలు పెట్టారు దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌. తన కలల రారాణి అలీసియాని జీవితంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ కొత్త మజిలీని మొదలు పెట్టారు. ఆమె వెన్నంటే తిరుగుతూ సంతోషాల హరివిల్లులో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు.. భార్య చేయి పట్టుకుని దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ తనకు షాదీ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నాడు ఆమెతో మరింత దగ్గరగా ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ మనసులోని భావాలను బయటపెట్టారు. (చదవండి: 'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్‌?')

"14 వందల ఏళ్ల క్రితం ఇమామ్‌ అలీ.. ఫాతిమాతో ఏమన్నాడో తెలుసా? నిన్ను చూస్తే చాలు.. నా బాధలు, భయాలు అన్నీ ఏదో మంత్రం వేసినట్లుగా మటుమాయవుతాయి అని! సరిగ్గా ఇప్పుడు నాక్కూడా అదే అనిపిస్తోంది అలీసియా. నిన్ను చూస్తే నా బాధరబందీలు అన్నీ మర్చిపోయి మనసంతా హాయిగా ఉంటోంది. ఏదేమైనా జీవితాంతం నువ్వు నాదానివే.." అంటూ భార్య మీద ప్రేమను కురిపించారు. కాగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ కేవలం దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన సుల్తాన్‌, టైగర్‌ జిందా హై, భారత్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తాండవ్‌ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తుండగా, దీనికి హిమాన్షు కిషన్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డింపుల్‌ కపాడియా, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేశ రాజకీయాల నేపథ్యంలో సాగనున్న ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 15 నుంచి ప్రసారం కానుంది. (చదవండి: దీపిక ఎందుకిలా చేసింది?: ఫ్యాన్స్‌ కంగారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement