Bigg Boss 6 Telugu: Inaya Sultana Trending And Got Huge Votes - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ట్రెండింగ్‌లో ఇనయా.. ఒక్క ఎపిసోడ్‌తో టాప్‌ ప్లేస్‌లోకి

Published Tue, Sep 27 2022 3:38 PM | Last Updated on Wed, Sep 28 2022 11:28 AM

Bigg Boss 6 Telugu: Inaya Sultana Trendin Nd Got Huge Votes - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో నామినేషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటిదాకా ఫ్రెండ్స్‌ అనుకున్నవాళ్లు కూడా సిల్లీ రీజన్‌ చెప్పి నామినేట్‌ చేస్తుంటారు. ఇక నాలుగోవారం జరిగిన నామినేషన్స్‌ కూడా అదే రేంజ్‌లో జరిగాయి. ఈసారి నామినేషన్స్‌ హౌస్‌మేట్స్‌ వర్సెస్‌ ఇనయా అన్నట్లుగా సాగింది. కంటెస్టెంట్స్‌ అందరూ గుంపగుత్తగా ఇనయాను టార్గెట్‌ చేశారు. ఈవారం శ్రీహాన్‌, సుదీప, గీతూ, ఆరోహి, శ్రీసత్య, చంటి, ఆర్జే సూర్య,రోహిత్‌ అండ్‌ మెరీనా, కీర్తి సహా తొమ్మిదిమంది ఇనయాను నామినేట్‌ చేశారు.

శ్రీహాన్‌తో ముందు నుంచీ గొడవ ఉండటంతో అతడు నామినేట్‌ చేస్తాడని ముందే ఊహించారు. ఇక వీరిద్దరి మధ్య పిట్ట టాపిక్‌ మళ్లీ రావడంతో ఇనయా కూడా బాగానే డిఫెండ్‌ చేసకుంది. అంతేకాకుండా ఆమె నామినేట్‌ చేయడానికి వెళ్తే శ్రీహాన్‌ ఆవలిస్తూ ఒక్క నిమిషం ఆగు అంటూ ఇనయాను హేళన చేశాడు. ఇది కూడా ఆమెకు ప్లస్‌ అయ్యింది. ఆ తర్వాత ఆర్జే సూర్యకి కూడా దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చింది ఇనయా. నలుగురు పట్టుకుని నన్ను లాక్కునిపోతుంటే నా డ్రెస్‌పైకి పోతుందని అరిచినా పట్టించుకోకుండా లెక్కెళ్లావ్‌ నువ్వెం ఫెమినిస్ట్‌వి అంటూ గట్టిగానే బుద్దిచెప్పింది.

అయితే అప్పటిదాకా ఎంతమంది వచ్చి నామినేట్‌ చేసినా అంతే స్ట్రాంగ్‌గా తన పాయింట్స్‌ చెప్పి డిఫెండ్‌ చేసుకున్న ఇనయా ఎంతో క్లోజ్‌గా ఉన్న మెరీనా అండ్‌ రోహిత్‌లు నామినేట్‌ చేయడంతో తీసుకోలేకపోయింది. ఇది ఊహించనలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మొత్తంగా సోమవారం జరిగిన ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఇనయా గ్రాఫ్‌  ఓ రేంజ్‌లో పెరిగిందని  చెప్పొచ్చు. ఓటింగ్‌లోనూ రేవంత్‌ తర్వాత ఇనయా రెండో ప్లేస్‌లో దూసూకుపోతుంది. దీంతో ఇనయా పేరు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement