బిగ్‌బాస్‌ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్‌ | Bigg Boss 6 Telugu: Inaya Sultana Meets RJ Surya After Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్‌

Published Tue, Dec 13 2022 9:14 PM | Last Updated on Tue, Dec 13 2022 9:24 PM

Bigg Boss 6 Telugu: Inaya Sultana Meets RJ Surya After Elimination - Sakshi

గతవారం బిగ్‌బాస్‌ షో నుంచి ఇనయ సుల్తాన ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్‌ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ ఆమె ఫాలోవర్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా 14 వారాలు హౌస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆరోహి ఎలిమినేట్‌ అయిన అనంతరం ఆమె సూర్యకు క్లోజ్‌ అయ్యింది. వీరిద్దరి సాన్నిహిత్యం చూసింది అంతా సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనుకున్నారు.

చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు

సూర్య తనకు మంచి స్నేహితుడు అంటూనే అతడిపై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపించింది ఇనయ. అలాగే సూర్య కూడా. ఇక ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని, ఇక హౌజ్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుకుంటుండగా అనూహ్యంగా సూర్య ఎలిమినేట్‌ అయ్యాడు. ఇక సూర్య హౌజ్‌ వీడటంతో ఇనయ పడిన బాధ ఇంతఅంత కాదు. ఇక హౌజ్‌లో అతడి కప్పును వాడటం, సూర్య సూర్య అంటూ కలవరించడం చేసింది. ఆ తర్వాత హోస్ట్‌ నాగార్జున కాస్తా వారించడం ఇక ఆటపై దృష్టి పెట్టింది. అలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న ఆమె 14వ వారం బిగ్‌బాస్‌ హౌజ్‌ను వీడింది.

ఇక బయటక వచ్చిరాగానే ఇనయ, సూర్యను కలుసుకుంది. ఇనయతో కలిసి క్లోజ్‌గా దిగిన ఫొటోను సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశాడు. ఇందులో సూర్య, ఇనయను హగ్‌ చేసుకుని కనిపించాడు. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తు‍న్నారు. ‘హౌజ్‌లో బాగా కనెక్ట్‌ అయిన వీరిద్దరు బయట కూడా అలాగే ఉంటారో లేదో చూడాలి’, ‘ఈ రిలేషన్‌ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూస్తాం’ కొందరూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు ‘లేడీ టైగర్‌ ఇనయా’, ‘ఇనయది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌, రియల్‌ బిగ్‌బాస్‌ విన్నర్‌’ అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

చదవండి: విజయ్‌ సేతుపతి షాకింగ్‌ లుక్‌ వైరల్‌, అవాక్కవుతున్న ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement