బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో లేడీ టైగర్‌గా పేరు తెచ్చుకుంది ఇనయ సుల్తాన. టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇచ్చే ఇనయ నామినేషన్స్‌లో కూడా అందరితో వాదించేది. మొదట్లో తన ప్రవర్తనతో చిరాకు పుట్టించినప్పటికీ రానురాను మాటతీరు, ఆటతీరు మెరుగుపరుచుకుని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనలో ఉన్న ఫైర్‌ను చూసి రేవంత్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉందే అనుకున్నారంతా!
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫినాలేకు ఒక వారం ముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను అలా ఎలా పంపించేస్తారని అభిమానులు బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ద్వారా పాపులారిటీ, స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఇనయ ఈ షో ద్వారా ఎంత వెనకేసిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఇనయ సుల్తానా వారానికి లక్ష రూపాయల పైనే రెమ్యునరేషన్ అందుకుందట. ఈ లెక్కన పద్నాలుగు వారాలకు గానూ సుమారు రూ.15 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మిడ్ వీక్ ఎలిమినేషన్, శ్రీహాన్‌కు ఇనయ ఫుల్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment